Begin typing your search above and press return to search.
అమ్మకు అలా.. చిన్నమ్మకు ఇలా..
By: Tupaki Desk | 16 Feb 2017 4:43 AM GMTఎంత అవునన్నా.. కాదన్నా..అమ్మ.. అమ్మే. చిన్నమ్మ.. చిన్నమ్మే. అమ్మ స్థానాన్ని భర్తీ చేస్తానని చెప్పినా.. అది మాట వరసకే.. కానీ.. చేతల్లో ఎంత మాత్రం కాదన్న విషయం తేలిపోయింది. అమ్మ తీరుకు.. చిన్నమ్మ వైఖరికి మధ్యనున్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమైపోయింది. అంతేనా.. ఒకేలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అమ్మకు.. చిన్నమ్మకు మధ్యనున్న తేడా.. వారికి ఎదురైన స్పందనల్ని చూస్తే.. ఈ తేడా ఇట్టే తెలిసిపోతుంది.
అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించిన చిన్నమ్మ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి.ఇలాంటి సందర్భమే 2014లో కూడా చోటు చేసుకుంది. అప్పట్లో ఇదే కేసుకు సంబంధించి బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డిక్యూనా అమ్మతో సహా మరోముగ్గురికి (అందులో చిన్నమ్మ కూడా ఉన్నారు) దోషులుగా తేలుస్తూ.. జైలుశిక్షవిధించారు.
ఈ తీర్పు నేపథ్యంలో నాడు తమిళనాడు నుంచి కర్ణాటక వరకూ కారులోనే వెళ్లారు జయలలిత. కోర్టు తీర్పు దోషిగా తేల్చినప్పటికీ.. ప్రజలు మాత్రం ఆమెను చూసేందుకు ఎగబడటమేకాదు.. నలు దిశలా మారుమోగేలా జయకారు చేశారు. చివరకు పరాయి రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఆమెకు అలాంటి ఆదరణే లభించింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో అమ్మకు లభించిన ఆదరణ అప్పట్లో అందరూ చర్చించుకునేలా చేసింది. అయినప్పటికీ.. ముకుళిత హస్తాలతో గంభీరంగా జైలుకు వెళ్లిపోయారు. కట్ చేస్తే..
మళ్లీ రెండేళ్ల తర్వాత ఇదే కేసులో దోషులుగా నిర్ధారిస్తూ సుప్రీం తీర్పు వెలువడింది. అమ్మ లేని వేళ.. చిన్నమ్మ అండ్ కోను దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో.. జైలుకువెళ్లేందుకు అప్పట్లో అమ్మ మాదిరే రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ తో వెళ్లిన అమ్మ తీరులోనే చిన్నమ్మ బయలుదేరారు. అయితే.. అప్పట్లో అమ్మ మాదిరి చిన్నమ్మకు జయధ్వానాలు లభించలేదు. అంతేనా.. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు వద్దకు చిన్నమ్మ చేరుకోగానే.. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయటమే కాదు.. వారు వచ్చిన వాహనాల మీద రాళ్లు విసిరిన వైనం చూసినప్పుడు అమ్మ అమ్మే. చిన్నమ్మ చిన్నమ్మేనని చెప్పక తప్పదు. ప్రజానేతగా గుర్తింపు పొందిన వారి విషయంలో ప్రజల స్పందనకు.. వారిని ఫాలో అవుతూ.. కాలం పుణ్యమా అని అమ్మ స్థానంలోకి వచ్చినా.. చిన్నమ్మను చిన్నమ్మ మాదిరే జనాలు చూస్తారే కానీ..అందుకుభిన్నంగా చూడరన్న విషయం తాజా ఉదంతం తేల్చేసిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/