Begin typing your search above and press return to search.
పెట్రోల్..డీజిల్ మధ్య తేడా చూస్తే మోడీ మేజిక్ తెలుస్తుంది
By: Tupaki Desk | 3 Sep 2019 5:43 AM GMTమాటల్లో తియ్యదనం.. చేతల్లో కరకుదనం ప్రధాని మోడీ సొంతం. తొలి టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని.. ప్రతికూల ప్రచారం జోరుగా సాగినప్పటికి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న మోడీ.. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్న మాట మాజీ ప్రధాని మన్మోహన్ నోట వెంట రావటం తెలిసిందే.
దేశ ఆర్థిక పరిస్థితి నిజంగానే దారుణంగా ఉందా? అన్న విషయాన్ని వెనువెంటనే చెప్పలేం. సామాన్యులైతే వాళ్లు చెప్పింది.. వీళ్లు చెప్పింది వినాలే తప్పించి.. నిజం ఏమిటన్నది వెనువెంటనే తెలుసుకోలేని పరిస్థితి. అయితే.. ఒక లెక్క చూస్తే.. మోడీ మాష్టారు వేసే దెబ్బ ఎలా ఉంటుందో అర్థమవుతుందని.. కనిపించకుండా బాదేసే ఆయన బాదుడు ఎంతలి భారాన్ని మోపుతాయన్న దానికి ఒక లెక్కను ప్రాతిపదికగా తీసుకోవచ్చంటారు.
వాహనాల విషయంలో దేశ ప్రజలకు అందుబాటులో ఉన్నవి పెట్రోల్.. డీజిల్.. గ్యాస్. ఇందులో సంప్రదాయ ఇంధనంగా చెప్పే పెట్రోల్.. డీజిల్ ను తీసుకుంటే.. మొదట్నించి ఈ రెండింటి మధ్య ధర వ్యత్యాసం భారీగా ఉండటం తెలిసిందే. పెట్రోల్.. డీజిల్ మీద ప్రభుత్వం కొంత సబ్సిడీ భారాన్ని భరిస్తూ.. ప్రజల మీద భారాన్ని మోపకుండా ఉండటం తెలిసిందే. అయితే.. దేశీయంగా చమురు వినియోగం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ మీద ప్రభుత్వం భరించే సబ్సిడీ బిల్లు స్థాయికి మించిపోవటం.. ఆర్థికంగా భారాన్ని మోపుతుండటంతో ప్రభుత్వ సబ్సిడీని అంతకంతకూ తగ్గిస్తూ వచ్చారు.
ఇదొక అంశమైతే.. పెట్రోల్.. డీజిల్ మధ్య ధర తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతోనే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే.. డీజిల్ వాహనాల ధర ఎక్కువగా ఉండటం తెలిసిందే. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ కారు తక్కువలో తక్కువ లక్ష రూపాయిలు నుంచి ఆ పైనే ఎక్కువగా ఉండే పరిస్థితి. ఎందుకిలా అంటే.. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆ వాహనాల్ని వినియోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. డీజిల్ వాహనాలతో కాలుష్యం ఎక్కువే కాదు.. మొయింటైనెన్స్ కూడా ఎక్కువేనన్న మాట వినిపించినా రోజువారీగా వినియోగించే డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆ వాహనాల్ని కొనేందుకే మొగ్గు చూపేవారు. పెట్రోల్ వాహనంతో పోలిస్తే.. డీజిల్ వాహనాలు మైలేజీ కాస్త ఎక్కువగా ఇవ్వటంతో వాటిని కొనేందుకే ఇంట్రస్ట్ చూపే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. మోడీకి ముందు మోడీ తర్వాత లీటరు పెట్రోల్.. డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఎంతలా తగ్గిందన్న విషయం చూస్తే షాక్ తినటం ఖాయం. మెత్తగా ఎంత భారాన్ని మోడీ ప్రజల మీద వేశారనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. మన్మోహన్ హయాం స్టార్ట్ అయిన 2004 నుంచి ప్రస్తుతం మోడీ హయాం వరకూ ఢిల్లీ రాష్ట్రంలోని పెట్రోల్?. డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. మన్మోహన్ హయాంలో ముడిచమురు ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. ఇప్పటి మాదిరి పెట్రోల్.. డీజిల్ మధ్య ధర వ్యత్యాసం ఉన్న దాని కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
తాజాగా హైదరాబాద్ లో ఈ రెండు ఇంధనాల మధ్య వ్యత్యాసం లీటరకు కేవలం రూ.5 మాత్రమే. ఇక.. గతంలోకి వెళితే డీజిల్ ధర ఎంత తక్కువగా ఉంటుందో.. పెట్రోల్ ధర ఎంత ఎక్కువన్నది తెలుస్తుంది.
సంవత్సరం పెట్రోల్ కంటే డీజిల్ ధర లీటరుకు ఎంత తక్కువంటే
2004 జూన్ రూ. 12.97
2005 ఏప్రిల్ రూ.09.77
2006 ఏప్రిల్ రూ.13.05
2007 ఏప్రిల్ రూ.12.75
2008 ఏప్రిల్ రూ.13.74
2009 ఏప్రిల్ రూ.13.84
2010 ఏప్రిల్ రూ.09.90
2011 ఏప్రిల్ రూ.20.75
2012 ఏప్రిల్ రూ.24.69
2013 ఏప్రిల్ రూ.17.46
2014 ఏప్రిల్ రూ.16.78
2015 ఏప్రిల్ రూ.10.78
2016 ఏప్రిల్ రూ.11.35
2017 జులై రూ.09.76
2018 జులై రూ.08.17
2019 జులై రూ.06.27
ఆగస్టు 02న హైదరాబాద్ లో పెట్రోల్ కు డీజిల్ కు మధ్య లీటరుకున్న వ్యత్యాసం కేవలం రూ.5.41 మాత్రమే ఉండటం గమనార్హం. ఇప్పుడు అర్థమైందా మోడీ మాష్టారి పాలన ఎలా ఉంటుందో?