Begin typing your search above and press return to search.
ఆ పార్టీలో కుల చిచ్చు..అందుకే కేసీఆర్ బిందాస్
By: Tupaki Desk | 30 May 2018 4:31 AM GMTతెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార టీఆర్ ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతూనే మరో వైపు అంతర్గత లుకలుకలతో ఆ పార్టీ కుదేలు అవుతోంది. కులాల వారీగా చీలిపోయిన నాయకుల మధ్య విబేధాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ దూసుకువెళుతుంటే మరోవైపు తాము ఈ అంతర్గత కలహాలతో సతమతం అయిపోతున్నాం కాబట్టే... అధికారం కైవసం చేసుకునే టెన్షన్ లేకుండా కేసీఆర్ బిందాస్ గా ఉన్నారని చెప్తున్నారు.
కొద్దికాలం క్రితం వరకు టీఆర్ ఎస్ సర్కారుపై ప్రజల్లో ఒకింత అసంతృప్తి పెరిగిన విషయాన్ని కాంగ్రెస్ గమనించింది. ఈ పరిస్థితి నుంచి లాభపడేందుకు బస్సుయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త టూరుకు సిద్ధమైంది. అయితే, అదే సమయంలో దీనికి కౌంటర్‌గా సీఎం కేసీఆర్ రైతుబంధును ప్రవేశపెట్టారు. రైతు బంధు పథకంలో భాగంగా టీఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపణీ పూర్తి చేసి గ్రామపంచాయతీ ఎన్నికలకు మోడల్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రజల ఫోకస్ అంతా టీఆర్ ఎస్ వైపు తిప్పుకోగలిగింది. దీంతో ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. రైతు బంధు పథకం అనగానే కాంగ్రెస్ పార్టీకి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా తయారైంది. రైతుకు ఏడాదికి 8వేలు ఇస్తుంటే...దానిపై ఎక్కువగా మాట్లాడితే రైతు తమ వాదన వినరనే అభిప్రాయంతో చాలా మంది నేతలు ఉండిపోయారు. మరోవైపు ఇందులో ఉన్న పలు అంశాలపై స్పందించడం కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఈ పరిణామమే కాంగ్రెస్‌కు మింగుడుపడకుండా మారగా..మరోవైపు ఆ పార్టీలోని లుకలుకలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశారు.
గాంధీ భవన్ వర్గాల సమాచారం మేరకు బీసీలకు 45 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ సమస్యపై కొంతమంది బీసీ నేతలు అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవడం గమనార్హం. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ - ఓబీసీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జి కత్తి వెంకటస్వామి - మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ - పార్టీ ప్రధాన కార్య దర్శి దాసోజు శ్రవణ్ తదితరులు బీసీలకు సముచితస్థానం కల్పించాలని గట్టిగా వాదిస్తున్నారు. దీంతో రెడ్డి సామాజికవర్గానికి - బీసీలకు మధ్య ఒకింత ఉద్రిక్తత నెలకొంది. వచ్చే ఎన్నికల్లో బీసీ వాదంతోనే ఎన్నికలకు పోవాలని పార్టీపై ఒత్తిడి పెంచుతున్నట్టు సదరు నేతలు చెబుతున్నారు. ఎస్సీ - ఎస్టీలకు రిజర్వేషన్ సీట్లే కాకుండా ఇతర నియోజకవర్గాలను కూడా కేటాయించాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడమే ప్రధాన సమస్యగా ఉంటే...టీఆర్ ఎస్ ను ఢీ కొట్టడంపై ఎలా దృష్టిసారించగలరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.