Begin typing your search above and press return to search.
నచ్చిన అమ్మాయిని ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవచ్చు!
By: Tupaki Desk | 22 July 2020 3:30 AM GMTఇండోనేషియా దేశంలోని మారుమూల దీవి సుంబాలో ఓ పాడు ఆచారం అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది. అక్కడి యువకులకు ఏ పెళ్లికాని యువతి కనపడినా వారి అంగీకారం లేకుండానే కిడ్నాప్ చేసుకొని పెళ్లి చేసుకోవడమే ఆ ఆచారం. తాజాగా ఇలా యువతులను ఎత్తుకెళ్తున్న యువకుల వీడియోలు వైరల్ కావడంతో ఆ దేశ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునే ఈ ఆచారం పేరు ‘కవిన్ టాంగ్ కాప్’. ఇది సుంబా ద్వీపంలో వివాదాస్పద ఆచారం. ఇందులో ఒక అబ్బాయి.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిపోవచ్చు. ఇందుకోసం స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఏకంగా దండయాత్రలా నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేయవచ్చు.
ఈ ఆచారాన్ని నిషేధించాలని ఇండోనేషియా మహిళా హక్కుల సంఘాలు చాలాకాలంగా పిలుపునిస్తున్నప్పటికీ ఇండోనేషియా లోని బాలీకి తూర్పుగా ఉన్న సుంబా దీవిలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది.
తాజాగా పెళ్లి చేసుకోవడం కోసం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఆచారానికి ముగింపు పలకాలని ఇండోనేషియా ప్రభుత్వం పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు రావడంతో ఈ ఆచారాన్ని రూపుమాపాలంటూ సుంబా స్థానిక నాయకులు ఈనెల ప్రారంభంలో ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. దేశ మహిళా సాధికారత మంత్రి హాజరై ఆ దీవి ప్రజలను ఒప్పించారు. దీంతో ఇప్పుడు ఈ ఆచారానికి కొద్దిలో కొద్దిగా చెక్ పడింది.