Begin typing your search above and press return to search.
వెలగపూడి కాదని వెతలపూడి
By: Tupaki Desk | 3 Nov 2016 11:04 AM GMTఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో అధికారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మిగతా సౌకర్యాల మాటెలా ఉన్నా కనీసం ఆఫీసు పనుల కోసం ఫోన్ మాట్లాడాలన్నా కుదరడం లేదట. తాత్కాలిక సచివాలయంలోని ఫోన్లు మూగబోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ల్యాండ్ లైన్ ఫోన్లకు కనెక్షన్లు ఇవ్వకపోవడం, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందకపోతుండడంతో అధికారులు, ఉద్యోగుల మధ్య సమాచార లోపం తలెత్తుతోంది. పక్క పక్క క్యాబిన్లలో పనిచేసుకుంటున్నా ఎవరు అందుబాటులో ఉన్నారో - ఎవరు లేరో తెలియని పరిస్థితి నెలకొంటోంది.
కార్యాలయాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లు ఏర్పాటు చేసి నెలరోజులు గడచినా నేటికీ ఏ డిపార్ట్ మెంట్ కు కనెక్షన్ ఇవ్వలేదు. ఇంతవరకు సచివాలయ ల్యాండ్ లైన్ నంబర్ ను కూడా ప్రకటించలేదు. దీనికితోడు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండకపోతుండడంతో ఎవరినైనా పిలవాలంటే అటెండర్లను పంపించి వారిని రప్పించుకుంటున్న పరిస్థితి.
అంతేకాదు... తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెడితే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లే. సచివాలయంలోని అన్ని శాఖలతో పాటు మంత్రుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన టివిలకు కూడా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో బయట జరిగే విషయాలు మంత్రులకు కూడా తెలియడం లేదు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/