Begin typing your search above and press return to search.
ముందస్తు ఎన్నికలు డిసెంబరులోనా? ఫిబ్రవరిలోనా?
By: Tupaki Desk | 6 Sep 2018 5:17 AM GMTముందస్తుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా వస్తున్న వార్తలు తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మరికొద్ది గంటల్లో ( ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి) అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కోరుతారని చెబుతున్నారు. విపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో దూసుకెళుతున్న కేసీఆర్.. ముందస్తుకు వెళ్లటానికి ప్రధాన కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం.. రానున్న రోజుల్లో పెరిగే ప్రభుత్వ వ్యతిరేతకను తప్పించుకోవటానికన్న మాట పలువురి నోట వినిపిస్తుంది.
కేసీఆర్ ముందస్తు ఆలోచన మొత్తం దీని చుట్టూనే తిరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంటే.. తన ప్రభుత్వంపై మొదలైన అసంతృప్తి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే.. అప్పటికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుందని.. దాన్ని తప్పించుకోవటానికి వీలుగా ఆర్నెల్ల ముందు ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న మాట అందరూ చెప్పేది.
అంటే.. కేసీఆర్ ముందస్తు వ్యూహం మొత్తం ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల మీదనే ఆధారపడి ఉన్నట్లు. మరి.. కేసీఆర్ అనుకున్నట్లు నవంబరు లేదంటే డిసెంబరులోనే ఎన్నికలు జరుగుతాయా? అంటే..అందుకేగా.. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు కూర్చొని మరీ అభయాన్ని పొందిందన్న మాటను చెబుతారు. ముందస్తుగా మోడీ మాట ఇచ్చినా.. పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం పవర్లో ఉన్న వారికి మామూలే.
తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడ్ని మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాతి కాలంలో చెప్పిందేమిటో తెలిసిందే. అదే రీతిలో విభజన తర్వాత కాంగ్రెస్ షాకిచ్చేలా కేసీఆర్ రాజకీయ నిర్ణయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. రాజకీయాల్లో ఎవరిని ఎప్పుడూ నమ్మలేం. పరిస్థితులకు తగ్గట్లుగా.. వారి వారి పార్టీల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయి.
ఇలాంటప్పుడు కేసీఆర్ కోరుకున్నట్లు డిసెంబరులోనే ఎన్నికలు జరగటానికి ఉన్న అవకాశాలు ఎన్ని? జరగకపోవటానికి అవకాశం ఉందా? ఉంటే.. దాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.ముందస్తుకు వెళుతున్న కేసీఆర్.. తాను కోరుకున్నట్లుగా ఎన్నికలు జరగటానికి ఉన్న అనుకూలాంశాలు ఎన్ని? ప్రతికూలాంశాలు ఎన్ని అన్నది చూస్తే..
అనుకూలం 1
ఒక అసెంబ్లీ రద్దయిన వెంటనే వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయితే వాటితో పాటు రద్దయిన శాసనసభకూ ఎన్నికలు నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఆ లెక్కన సెప్టెంబరులో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే అక్టోబరులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
సానుకూలాంశం 2
కేసీఆర్ కోరుకున్నట్లుగా ముందస్తు ఎన్నికలు జరగటానికి వీలుగా ఈసీ ప్రయత్నాలకు కేంద్ర సహాకారం ఇస్తుందన్న మాట మోడీషాలు ఇవ్వటంగా చెప్పొచ్చు. తన ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఇద్దరు ఆగ్రనేతల దగ్గర మాట తీసుకున్నట్లు సమాచారం.
సానుకూలాంశం 3
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కొర్రీ పెట్టేలా కేంద్రం సాంకేతిక అంశాల్ని తెర మీదకు తీసుకురాకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేయటం.
సానుకూలాంశం 4
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్న వేళ.. ఆయన అనుకున్నట్లే ఎన్నికలు జరగటానికి కేంద్ర ఎన్నికల సంఘంలోఇద్దరు ముఖ్యులు సానుకూలంగా ఉంటే సరిపోతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరు ఎన్నికల కమిషన్లు తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం.
ప్రతికూలాంశం 1
(ఇది పెద్ద అడ్డంకి కాదనే అధికారులు లేకపోలేదు. హటాత్తుగా మధ్యంతరం వస్తే సదరు ఏడాది జనవరి 4 వరకు సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది)
ప్రతికూలాంశం 2
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బలగాల కొరత. ఎన్నికల సంఘం అడిగినన్ని బలగాలను కేంద్రం ఇవ్వలేకపోతే ఈసీ ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి బలగాల విషయంలో కేంద్రం ఒత్తిడిలో ఉంది. మూడు లక్షల మంది సీఆర్ పీఎఫ్ బలగాల్లో 30 వేలమందిని ఎన్నికలు జరిగే ఛత్తీస్ గఢ్లో మోహరించారు. అక్కడ భారీ ఎత్తున నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బలగాల కొరత చూపించి కేసీఆర్ ముందస్తుకు హ్యాండ్ ఇచ్చే వీలుంది.
ప్రతికూలాంశం 3
నాలుగు రాష్ట్రాలతోపాటు ముందస్తుకు వెళ్లాలంటే కనీసం సభ రద్దుకు, ఇతర రాష్ట్రాల నోటిఫికేషన్‌కు మధ్య 50 రోజుల గడువు ఉండాలనే వాదన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా శాసనసభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమైతే ముందుగా జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికలతో కలిపేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. అక్టోబరు మొదటి వారంలో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. తెలంగాణ ఎన్నికలు కూడా నాలుగు రాష్ట్రాలతో పాటు జరగాలంటే కేవలం 30 రోజుల గడువు ఉంది. ఆగస్టు 31 లోగా అయితే, ఎన్నికల సంఘం దగ్గర సంప్రదింపులకు తేలిగ్గా ఉండేది.
ప్రతికూలాంశం 4
ఈ ఏడాది 18 ఏళ్లు పూర్తయిన యువతకు ఓటు హక్కు రావాలంటే జనవరి 4వ తేదీ తర్వాతే సాధ్యమవుతుంది. డిసెంబరులోనే ఎన్నికలు జరిగితే వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారు. ఈ అంశంపై వారు కోర్టును ఆశ్రయిస్తే డిసెంబరులో ఎన్నికలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితే తలెత్తితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలోని 3 శాసనసభ నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను ఆంధ్రలోని 2 నియోజకవర్గాల్లో కలిపిన నేపథ్యంలో మూడు తెలంగాణ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్టీ జనాభాను నిర్ధారించి, అవి ఎస్టీ నియోజకవర్గాలేనని తేల్చాల్సి ఉంది.