Begin typing your search above and press return to search.
పరారీలో మాజీ ఎంపీ... ఖాకీలకు చిక్కుతారా?
By: Tupaki Desk | 2 Oct 2019 3:29 PM GMTఏపీలో ఇప్పుడు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా వైరల్ గానే మారిపోతోంది. ఇటు అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ - ఈ రెండు పక్షాలకూ అర్హత సాదించని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ - సింగిల్ సీటుకే సరిపెట్టుకున్న జనసేన... ఇలా అన్ని పార్టీల వ్యవహారాలు వైరల్ గా మారిపోయాయి. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత - మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పరారీలో ఉన్నారన్న వార్తలు మరింత సంచలనంగా మారిపోయాయి. అయినా ఇటు అధికారంలో లేకుండా - అటు విపక్షంలో లేకుండానే హర్ష కుమార్ ఏం తప్పు చేశారని పరారీలో ఉన్నారన్న విషయం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పక తప్పదు.
ఆ వివరాలేంటో చూద్దాం పదండి. నోరు తెరిస్తే... తనదైన వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న హర్ష కుమార్... మొన్న తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో బోల్తా పడిన బోటు వ్యవహారానికి సంబంధించి ఒకింత ఆసక్తికరమైన వ్యాఖ్యలే కాకుండా సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోటు ప్రమాదం జరిగిన తర్వాత వారం రోజుల పాటు అసలేమాత్రం స్పందించన హర్షకుమార్... ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి సంచలన కామెంట్లు చేశారు. బోటు ప్రమాదానికి జగన్ సర్కారే బాధ్యత వహించాలని తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన హర్షకుమార్.. బోటు ప్రమాదం కారకులను కూడా ప్రభుత్వం రక్షిస్తోందని - ముందుగా జిల్లా ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని సంచలన కామెంట్లు చేశారు.
హర్ష కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయనే చెప్పాలి. బోటు ప్రమాదానికి కారకుడిగా నిలిచిన పోర్టు అధికారి ధర్మశాస్త్ర అనే అధికారిని ప్రభుత్వం రక్షిస్తోందని - ఆయనను రక్షించే వ్యవహారంలో జిల్లా ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని - తక్షణమే ఎస్పీపై కేసు నమోదు చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా బోటును వెలికి తీసేందుకు అవకాశం ఉన్నా కూడా జగన్ సర్కారు... అందుకు సిద్ధంగా లేదని కూడా ఆరోపించారు. బోటును బయటకు తీస్తే... జగన్ సర్కారుకు మచ్చ పడటం ఖాయమని, అందుకే బోటును వెలికి తీయడం లేదని ఆరోపించారు. ఓ రెండు రోజుల పాటు హర్షకుమార్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోని పోలీసులు.. హర్షకుమార్ స్వరం మరింతగా పెరిగేసరికి రంగంలోకి దిగేశారు.
జిల్లా ఎస్పీపైనే సంచలన కామెంట్లు చేసిన హర్షకుమార్... ఆ ఆరోపణలను నిరూపించాలని పోలీసులు ఓ వాదనను బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులపై మరింతగా విచుకుపడిన హర్షకుమార్ వైఖరిని చూస్తూ ఊరుకుంటే ఫలితం లేదని - నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు హర్షకుమార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఆయనపై ఏకంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఎంతైనా మాజీ ఎంపీ కదా... పోలీసుల యత్నాలను ముందుగానే పసిగట్టి అప్పటికప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు. రాజకీయ నేతలు పరారీలో ఉంటే... వారిని పట్టుకోవడం పోలీసులకు కాస్తంత కష్టమే కదా. ఇప్పుడు కూడా పరారీలో ఉన్న హర్షకుమార్ విషయంలోనూ పోలీసులు ఎంతగా యత్నిస్తున్నా... ఆయన జాడ తెలియడం లేదట. మరి నిఘాను కాస్తంత గట్టిగానే పెంచేసిన ఖాకీలకు హర్ష దొరుకుతారో - లేదో చేడాలి.