Begin typing your search above and press return to search.

దరిద్రం కాకుంటే.. జగన్ కు డిగ్గీ మద్దతేంటి..?

By:  Tupaki Desk   |   15 Oct 2015 11:14 AM IST
దరిద్రం కాకుంటే.. జగన్ కు డిగ్గీ మద్దతేంటి..?
X
ఏపీ కాంగ్రెస్ నేతలు కిందా మీదా పడిపోతున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ ఆనవాళ్లు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. విభజన జరిగి.. కొత్త ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ సగటు సీమాంధ్రుడి మనసులో కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ఫ్రెష్ గా ఫీలవుతున్న పరిస్థితి.

తమను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని సార్వత్రిక ఎన్నికల్లో పాతాళానికి తొక్కేసిన వైనం తెలిసిందే. ఇప్పటికి కాంగ్రెస్ ను దగ్గరకు రానిచ్చేందుకు సీమాంధ్రులు సిద్ధం లేరు. ఈ కారణంతోనే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. కేంద్రం సాయం చేయాలంటూ పలు అంశాల్ని డిమాండ్ల రూపంలో తెరపైకి తీసుకొచ్చి వరుసగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ఎవరూ స్పందించని దుస్థితి.

ఇలాంటి సమయంలో ఏపీ విఫక్ష నేత వైఎస్ జగన్.. తానొక్కడినే అన్నట్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరవధిక దీక్ష చేయటం తెలిసిందే. ఏపీ అధికారపక్షంపై పోరాటానికి విపక్ష పార్టీలు సై అంటున్నా.. జగన్ మాత్రం వారిలో ఎవరిని తనకు దగ్గరగా రానివ్వటం లేదు. ఇదిలా ఉంటే.. గుంటూరు నల్లపాడులో చేసిన దీక్షపై కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన దిగ్విజయ్ సింగ్ పొగిడేయటం ఏపీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. దీక్ష చేస్తున్న జగన్ కు తన పూర్తి మద్ధతు ఉంటుందని డిగ్గీరాజా వ్యాఖ్యలు చేయటంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఓపక్క ఏపీలో కాంగ్రెస్ ఆనవాళ్లు లేకుండా చేసి.. తానొక్కడే ఎదిగిపోతున్న జగన్ ను పొగిడేయాల్సిన అవసరం డిగ్గీరాజాకు ఏమిటంటూ ప్రశ్నిస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీక్ష చూస్తున్న జగన్ కు సపోర్ట్ గా నిలవటంతోపాటు.. పొగిడేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా ఢిల్లీకి వచ్చి అధినేత్రి సోనియాకు ఫిర్యాదు చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.