Begin typing your search above and press return to search.
ఇక అంతా డిజిటల్ పెళ్లిళ్లే గురూ!
By: Tupaki Desk | 28 April 2020 2:30 AM GMTఇన్నాళ్లు పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు చేసి చేసేవారు. విందు - మందు - చుట్టాలు - పక్కాలు - వందలాది మందికి భోజనాలు.. పెద్ద పెద్ద సమూహాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు, పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకునే ఖర్మ పడుతుంది. ఎందుకంటే ఎక్కువమందితో చేస్తే కరోనా అంటుకుంటుంది. ఫంక్షన్ హాల్లు - సెట్టింగులకు కాలం చెల్లి సుబ్బరంగా గ్రామాల్లోని సొంతిళ్లలో తక్కువ మందితో వేడుకలు చేసుకునే రోజులు రానే వస్తాయి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్ లైన్ లో జరిగేకాలమొచ్చింది. అసలు ఇలాంటిది జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.
దేశంలో ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా - ఏప్రిల్ - మే మరియు జూన్ నెలలలో ముందే షెడ్యూల్ చేయబడిన అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. ప్రయాణాలు నిషేధంతో రాకపోకలు లేక ప్రజలు ఏ వేడుకలకు హాజరు కాని పరిస్థిsr. అయినప్పటికీ - కొంతమంది తమ వేడుకలను వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆన్ లైన్ లో పెళ్లి చేసుకొని డిజిటల్ లో అందరికీ చూపించాలని అదే రోజున పెళ్లికి రెడీ అవుతున్నారు.
ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘జూమ్’ ద్వారా తమిళనాడులో ఒక జంట వివాహం చేసుకున్నారు. పాస్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో చేరారు, మరియు తరువాతి ప్రార్థనలు చేసి ఈ తంతును ఆచారాలతో పూర్తి చేశారు. కుటుంబ సభ్యులందరూ - బంధువులు కూడా కొత్త జంటను వీడియో కాల్స్ ద్వారా ఆశీర్వదించారు.
రాయ్ పూర్ లో కూడా - పూజారి శ్లోకాలు పఠించి వధువు తండ్రితో డిజిటల్ కన్యాదానం చేయించారు. లాక్ డౌన్ మధ్య ఒక జంట ఆన్ లైన్ లో వివాహం చేసుకున్నారు. మహమ్మారి దెబ్బకు ఇలా ఆన్‌లైన్ లోనే వివాహాలను చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది.
షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ లాక్డౌన్ లోనూ ఆన్ లైన్లో వివాహాలను తాను చూస్తున్నానని చెప్పారు. "ఈ ప్రతికూల సమయాల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి మేము వారికి సహాయం చేస్తున్నామన్నారు. షాదీ.కామ్ వంటి సైట్లు జంటలకు ఆన్‌లైన్ మేకప్ మరియు మెహెండి నిపుణులు - డిజిటల్ వెడ్డింగ్ ఆహ్వానాలు - అతిథుల ఇళ్లకు ఆహార పంపిణీకి సహాయం చేస్తున్నాయని తెలిపారు.