Begin typing your search above and press return to search.

డిగ్గీ ఐసిస్ ట్వీట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

By:  Tupaki Desk   |   3 May 2017 5:29 AM GMT
డిగ్గీ ఐసిస్ ట్వీట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?
X
ఒక్క ట్వీట్ తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. ట్వీట్ ను.. ట్వీట్ చేసిన నేత‌ను తీవ్రంగా ఖండించ‌ట‌మే కాదు.. చ‌ట్టం ఉంది జాగ్ర‌త్త అన్న మాట‌ను ప్ర‌స్తావించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ రాష్ట్ర పోలీసులు న‌కిలీ ఐసిస్ వెబ్ సైట్‌ను స్టార్ట్ చేసి.. ముస్లిం యువ‌కుల్ని ఆక‌ర్షించి.. వారిని ట్రాప్ చేసి కౌన్సిలింగ్ ఇస్తున్న‌ట్లుగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ ట్వీట్ పెట్ట‌ట‌మే కాదు.. ఈ త‌ర‌హా అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

డి్గ్గీ చేసినట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటు.. రాష్ట్ర హోం మంత్రి నాయిని.. ఇత‌ర పోలీసు ఉన్న‌తాధికారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. డిగ్గీ త‌న ట్వీట్ వ్యాఖ్య‌ల్నివెన‌క్కి తీసుకోవాల‌ని చెప్ప‌టం తెలిసిందే. ఈ ఉదంతం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై మ‌రింత స్ప‌ష్ట‌త కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు డిగ్గీతో ట‌చ్‌ లోకి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. తాను చేసిన ట్వీట్ ఆషామాషీగా చేసింది కాద‌ని.. దాని వెనుక చాలానే క‌థ ఉంద‌ని డిగ్గీ చెప్పిన‌ట్లుగా ఒక‌సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చెప్పిన‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ వ్య‌వ‌హారంపై త‌న‌ను కాంట్రాక్ట్ చేసిన కాంగ్రెస్ నేత‌ల‌కు పూర్తి స‌మాచారం ఇవ్వ‌ని డిగ్గీ.. ఈ ఉదంతం మీద జ‌రుగుతున్న ప‌రిణామాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయ‌న కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

డిగ్గీ ట్వీట్ వెనుకున్న అస‌లు క‌థేమిటి? ఆయ‌న ఎందుకింత సంచ‌ల‌న ట్వీట్ చేశార‌న్న విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలోముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను 12 శాతానికి పెంచుతూ తెలంగాణ అధికార‌ప‌క్షం తీసుకున్న నిర్ణ‌యం కాంగ్రెస్‌ ను తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచేలా ఉండ‌టంతో.. వారి దృష్టిని మ‌ర‌ల్చ‌టం కోస‌మే డిగ్గీ ట్వీట్ చేసిఉంటార‌ని చెబుతున్నారు.

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ త‌ర్వాత‌.. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్న నేప‌థ్యంలో.. త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో ముస్లిం వ‌ర్గాల్లో సానుభూతిని పెంచుకోవ‌టం ద్వారా టీఆర్ ఎస్‌ ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందుకే తాజా ట్వీట్ చేసి ఉంటార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి న‌కిలీ ఐసిస్ సైట్ తెర‌వ‌టం ద్వారా వ‌చ్చే న‌ష్టం ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు. ఒక‌వేళ డిగ్గీరాజా చెప్పిన‌ట్లే.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు న‌కిలీ సైట్ షురూ చేస్తే.. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు ఆక‌ర్షితులయ్యే వారిని గుర్తించ‌టంతో పాటు.. అలాంటి వారిని ప్రాధ‌మికంగానే చెక్ చెప్పే ఛాన్స్ ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

కానీ.. ఆ విష‌యాన్ని రాజ‌కీయం చేస్తున్న తీరు చూస్తే.. డిగ్గీకి ఏదో దూర‌పు ఆలోచ‌న ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. డిగ్గీ ట్వీట్ త‌మ‌కు చేసే లాభం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. తొంద‌ర‌పాటుతో వ్య‌వ‌హ‌రించారా? అన్న సందేహాన్ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. ముస్లింల మ‌న‌సుల్ని దోచుకునే ప్ర‌య‌త్నంలో హిందూ వ‌ర్గ ఓట‌ర్ల మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచేలా ఉంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న అబిప్రాయాన్ని ప‌లువ‌రు కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా డి్గ్గీ ట్వీట్ తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త క‌ల‌క‌లంగా మారింద‌న‌టంలో సందేహం లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/