Begin typing your search above and press return to search.
రాహుల్ దిగిపోవాల్సిందే అంటున్నారు
By: Tupaki Desk | 11 March 2017 8:32 AM GMTదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం - జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలదనే పేరున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలం అవడం ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ మెడకు పడేటట్లు కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తో జత కట్టినప్పటికీ రాహుల్ ప్రభావం ఆ రాష్ట్రంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి నుంచి మరి రాహుల్ తప్పుకోవాలా ? ఆ పార్టీకి కొత్త నాయకత్వం కావాలన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాహుల్ తన హోదా నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని వినిపించారు.
ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బలపడాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేని రాష్ట్రాల్లో ఎటువంటి ప్రణాళికలు చేపట్టాలన్న అంశాన్ని చర్చించనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని పునర్ నిర్మించేందుకు కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ ఇంత బలంగా ఉందని, అందు వల్లే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీకి వెళ్లిందని దిగ్విజయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువకులను ఎంకరేజ్ చేయదన్న అంశం అబద్దమన్నారు. కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తుందని, తాను 31 ఏళ్లు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ తనకు అవకాశం కల్పించారని దిగ్విజయ్ తెలిపారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇద్దరూ కుల రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడుపుతామన్న ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. హిందువులు, ముస్లిమ్‌ల ఓటర్లను ఆకట్టుకునేందుకు షా, మోదీలు ఇద్దరూ ప్లానేశారన్నారు.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిథి అభిషేక్ సింఘ్వి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సమూల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని వందకు పైగా స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 13 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగడం బాధాకరమన్నారు. పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశం కూడా కష్టం కావడం ఇబ్బందికరమేనని తేల్చిచెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/