Begin typing your search above and press return to search.
ఎగ్జిట్స్ పోల్స్... పార్టీల రియాక్షన్ ఇది
By: Tupaki Desk | 9 March 2017 4:15 PM GMTఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై వివిధ పార్టీలన్నీ స్పందించాయి. ఈ ఫలితాల్లో తీవ్ర నిరాశ ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత - ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రియాక్టయ్యారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ బోగస్ అని డిగ్గీ విమర్శించారు. వివిధ సంస్థలు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అనంతరం మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ సర్వేలపై నమ్మకం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో పంజాబ్ లో మాత్రమే కాంగ్రెస్ హవా కనబర్చనున్నట్లు సర్వేలు వెల్లడించడం సరికాదన్నారు. తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుందని తెలిపారు.
కాగా, సమాజ్ వాదీ పార్టీ మాత్రం భిన్నంగా స్పందించింది. రాహుల్ నాయకత్వంపై ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు మరో సారి చర్చకు తెరతీశాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీతో కలిసి అఖిలేష్ చేసిన ప్రచారం వ్యతిరేక ఫలితాలను ఇచ్చిందని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడగానే సమాజ్ వాదీ కార్యకర్తలలో ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది. రాహుల్ గాంధీ కేంద్రంపైనా - ప్రధానిపైనా మోతాదు మించి చేసిన విమర్శలు ప్రతికూల ఫలితాలకు కారణమన్న భావన వ్యక్తమౌతున్నది. బీజేపీ పుంజుకోవడానికి రాహుల్ వంటి బలహీనమైన నాయకుడిపై ఎస్పీ అధికంగా ఆధారపడటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉండగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి)- కాంగ్రెస్ పార్టీలు రెండూ పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కే లబ్ధి చేకూరుతుంది తప్ప సమాజ్ వాదీకి ఎలాంటి లాభం లేదని ఆ పార్టీ నేత రవిదాస్ మహోత్రా అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి అఖిలేష్ యాదవ్ కు ఉందని ఆయన అన్నారు. అనేక చోట్ల ఎస్‌పి అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఇదే జరిగితే బిజెపికి విజయం లభిస్తుందని ఆయన చెప్పారు.
కాగా, యూపీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు అవసరమైతే మాయావతితో పొత్తుకు సిద్ధమని అఖిలేష్ ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ,కాంగ్రెస్ లు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కూటమి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని అఖిలేష్ ప్రకటనతో తేటతెల్లమవుతోంది. ఇదే సమయంలో అఖిలేష్ భార్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమాజ్ వాదీ పార్టీ నేత, తన భర్త అఖిలేష్ యాదవ్ బాధ్యతలు చేపడతారని డింపుల్ యాదవ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ కాంపెయినర్ గా ప్రసిద్ధి చెందారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల అవడంతో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/