Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిషన్ స్టార్ట్ అయ్యిందా?
By: Tupaki Desk | 2 March 2020 12:09 PM GMTమధ్యప్రదేశ్.. గత కొన్నాళ్లలో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో స్వల్పమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంత వరకూ వరసగా మధ్యప్రదేశ్ ను ఏలిన బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అయితే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల వద్దకు వచ్చే సరికి కథ మారింది. మళ్లీ మధ్యప్రదేశ్ లో బీజేపీ స్వీప్ చేసింది. కమల్ నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడాదికి పై నుంచినే కొనసాగుతూ ఉంది.
అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ గగ్గోలు పెడుతూ ఉంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కమలం పార్టీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని, ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఆఫర్ ప్యాకేజీలను పంపుతోందని దిగ్విజయ్ అంటున్నారు.
కర్ణాటక తరహాలో తమ వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చి - బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోందని దిగ్విజయ్ ఆరోపించారు. అయితే మధ్యప్రదేశ్ లో కమలం పార్టీ ఆటలు సాగవని, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నదైతే బోటాబోటీ మెజారిటీ మాత్రమే.
230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలప్పుడు బీజేపీ 109 - కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ - ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ బీజేపీ మిషన్ స్టార్ట్ అయ్యిందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏం జరగుతుందో మధ్యప్రదేశ్ లో!