Begin typing your search above and press return to search.
డిగ్గీరాజా….ఇంత అతి అవసరమా?
By: Tupaki Desk | 23 Sep 2015 5:17 PM GMTచాలాకాలం తర్వాత తెరమీదకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తన వివాదాస్పద తీరుతో మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అనారోగ్యానికి చికిత్స పేరుతో అమెరికాలో ఉన్న దిగ్విజయ్ తన ట్వీట్ తో రాజకీయాల్లో వేడి పుట్టించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నప్పటికీ పార్టీలను విమర్శించడంలో బ్యాలెన్స్ కోల్పోయి డిగ్గీ చేసిన ట్వీట్ ఇపుడు రచ్చగా మారింది.
తన వ్యక్తిగత ఖాతాలో దిగ్విజయ్ సింగ్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఒకే మొహంలో సగభాగం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, మరో సగభాగం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీది. పరస్పరం నిప్పులు చల్లుకునే ఈ ఇద్దరు నేతలను ఒకే ఫొటోలాగా మార్ఫ్ చేసి ఉన్న దాన్ని పోస్ట్ చేసిన డిగ్గీ….వారి వారి మతాల అభివృద్ధి కోసం దురుద్దేశపూరిత పూరితంగా ప్రవర్తిస్తున్న వీరి వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయని పోస్ట్ చేశారు. తన మిత్రుడు ఒకరు ఈ ఫొటోను పంపించారని డిగ్గీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే డిగ్గీ ట్వీట్ పై అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. తన ఫొటోను డిగ్గీ ఆ విధంగా ఫోస్ట్ చేయడం పట్ల అభ్యంతరం లేదని…అయితే ఈ చర్య యావత్ ముస్లింలను అవమానించేలా ఉందన్నారు. దీనికి డిగ్గీ స్పందించారు. తమ పార్టీ పాలనలో అన్ని మతాలను సమానంగా చూడలేదా అంటూ నిలదీశారు. దీనికి ఓవైసీ ఘాటుగా స్పందించారు. బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టింది కాంగ్రెస్ పాలనలోనే కదా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే ముంబయిలో అల్లర్లు జరిగాయని, వాటిపై ఇచ్చిన నివేదికను అమలుచేయడంలోనూ ఆ పార్టీ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. పైపెచ్చు…. ఆ ఘటనల్లో నిందితుడు అయిన యాకుబ్ మెమన్ ను ఉరితీయడంపై ఇపుడు కట్టుకథలు చెప్తోందని మండిపడ్డారు.
కొద్దికాలం వరకు కాంగ్రెస్-ఎంఐఎంల మధ్య అత్యంత మైత్రి ఉండేది. గత సార్వత్రిక ఎన్నికల సమయంల నుంచి ఆ బంధానికి బీటలు వారాయి. తాజాగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీల మధ్య లుకలుకలు ఇలా రచ్చకెక్కాయి.