Begin typing your search above and press return to search.
డిగ్గీ మాటతో కోట్ల కోపం కరిగిపోయింది
By: Tupaki Desk | 21 Feb 2016 8:57 AM GMTకొంతమంది నేతలకు కోపం అస్సలే రాకూడదు. వారికి అగ్రహం వస్తే పార్టీకి వచ్చే చిక్కులు అన్నిఇన్ని కావు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైనా.. కొంతమంది నేతల మీద ఉన్న అక్కడి వారికున్న వ్యక్తిగత అభిమానం.. పార్టీ బతికి బట్టకట్టేలా చేస్తుంది. ప్రజల్లో అలాంటి ఇమేజ్ ఉన్న నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒకరు. తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న సూర్యప్రకాశ్ రెడ్డికి ఈ మధ్యకాలంలో ఊహించని అవమానం జరిగింది.
పార్టీ ఉనికే లేని రాష్ట్రంలో.. కాస్త క్యాడర్ ఉన్న నేత కోట్ల పట్ల పార్టీ వర్గాలు అనుచితంగా వ్యవహరించటం హాట్ టాపిక్ కావటమే కాదు.. పార్టీ సైతం జరిగిన తప్పునకు ఒకటికి రెండుసార్లు చెంపలు వేసుకున్న పరిస్థితి. ఈ మధ్య అనంతపురం జిల్లాకు వచ్చిన కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యక్రమానికి కోట్ల హాజరయ్యారు. ఆయన వేదిక మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. రాహుల్ సెక్యూరిటీ నో చెప్పేసింది. తాను ఎవరో వివరంగా చెప్పినా లైట్ తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ కాంగ్రెస్ పెద్దలు కూడా ఇదంతా చూసీచూడనట్లుగా వ్యవహరించటంతో కోట్లకు కోపం వచ్చింది.
అక్కడ నుంచి నేరుగా కర్నూలు వచ్చిన ఆయన.. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేసేయటం.. ఆయన అనుచరులు రచ్చ రచ్చ చేయటంతో.. కోట్ల ఆగ్రహం ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తాకాయి. విభజన కారణంగా ఏపీలో ముక్కి మూలుగుతున్న పార్టీకి కోట్ల ఇష్యూ తాటిపండులా మారటంతో నష్టనివారణ చర్యల్ని వేగవంతం చేసింది. అధినాయకత్వం తరఫున దూతను పంపి క్షమాపణలు కోరటమే కాదు.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తామని చెప్పినా.. కోట్ల ఆగ్రహం పెద్దగా తగ్గలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా విజయవాడలో ప్రారంభించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్.. కోట్లకు పార్టీ నేతల మధ్యనే క్షమాపణలు చెప్పారు. దీంతో.. టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్న కోట్ల కోపం డిగ్గీ మాటతో ఐస్ ముక్కలా కరిగిపోయింది. ఇదేదో మొదటే చేసి ఉంటే భోళామనిషి మనసు అంతలా నొచ్చుకునేది కాదేమో..?