Begin typing your search above and press return to search.
సింగ్ ఈజ్ కింగ్.. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ‘వృద్ధ జంబూకం’
By: Tupaki Desk | 28 Sep 2022 3:30 PM GMTరాజస్థాన్ సీఎం అశోక్ గ్లెహాత్ తోకజాడిస్తుండడంతో కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయనను పక్కకు తప్పించాలని సోనియాగాంధీ డిసైడ్ అయినట్టు సమాచారం. రాజస్థాన్ సీఎంగా యువకుడైన సచిన్ పైలెట్ కు పగ్గాలు అప్పజెప్పకుండా అశోక్ గెహ్లాత్ ఆడుతున్న గేమ్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈక్రమంలోనే అధ్యక్ష రేసులో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
అత్యున్నత పదవికి పార్టీ అంతర్గత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఈ పదవికి పోటీ చేయనున్నారని సమాచారం. "నేను ఎవరితోనూ (ఈ విషయం) చర్చించలేదు. నేను హైకమాండ్ నుండి అనుమతి తీసుకోలేదు" అని ఆయన మీడియాతో చెప్పారు. నేను పోటీ చేస్తానో లేదో అది నాకే వదిలేయండి’’ అంటూ పోటీ నుంచి ఎందుకు తప్పిస్తున్నారని చమత్కరించారు.
దిగ్వజయ్ సింగ్ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కోసం కేరళలో ఉన్నారు. ఈ రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. "హైకమాండ్ నన్ను కోరితే నామినేషన్ దాఖలు చేస్తాను" అని డిగ్గీ చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో శశి థరూర్ లేదా అశోక్ గెహ్లాట్ అనే ఇద్దరు పోటీదారులలో ఎవరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అనుకున్నారు. ఇప్పుడు అశోక్ గెహ్లాత్ వ్యవహారం చెడడంతో దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. శుక్రవారం జబల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని, అయితే పార్టీలోని ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తానని చెప్పారు.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ విధేయులు తిరుగుబాటు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల్లో గెహ్లాట్ ను తప్పించారు. అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని భావించారు . కానీ రాజస్థాన్ లో గందరగోళంలో పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియా గాంధీ కలత చెందడంతో అశోక్ గెహ్లాట్ కు అత్యున్నత పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఇప్పటికీ గెహ్లాట్ రన్నింగ్‌లో ఉన్నారా అనేది అస్పష్టంగా ఉంది.
ఢిల్లీలోని ఒక వర్గం నాయకులు గెహ్లాట్‌తో ఒక తీర్మానాన్ని తీసుకోవడానికి అంతర్గత చర్చలు ప్రారంభించారు. కొందరు అతను ఇంకా రేసులో ఉన్నారని చెబుతుండగా, రాజస్థాన్‌లోని నాయకులు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని చెబుతున్నారు. పార్టీలో "ఒక వ్యక్తి ఒకే పదవి" నియమానికి కట్టుబడి ఉంటుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యతో మొత్తం ఉత్కంఠ నెలకొంది.
సోమవారం రాజస్థాన్ లో తిరుగుబాటు తర్వాత మధ్యప్రదేశ్ మరో మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సోనియా గాంధీని కలిశారు. పార్టీ పదవికి పోటీలో గెహ్లాట్‌ను భర్తీ చేస్తారా లేదా అనే ఊహాగానాల మధ్య, అతను మధ్యప్రదేశ్‌పై తన దృష్టిని ఉంచాలనుకుంటున్నట్లు విలేకరులతో అన్నారు. దీంతో దిగ్విజయ్ సింగ్ ను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
"నాకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదు. నవరాత్రి శుభాకాంక్షల కోసమే నేను ఇక్కడ ఉన్నాను" అని కమల్ నాథ్ విలేకరులతో అన్నారు. ఈరోజు కేరళకు చెందిన మరో కాంగ్రెస్ కురువృద్ధుడు ఏకే ఆంటోనీ సోనియా గాంధీని కలుస్తున్నారు. ఆయన సలహాదారు హోదాలో ఉన్నారని వర్గాలు తెలిపాయి. పోటీ చేయడం లేదని తెలిపారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.