Begin typing your search above and press return to search.
కల్లు తాగితే 'దిగ్విజయ'మేనా?
By: Tupaki Desk | 17 Nov 2015 7:09 AM GMTకాంగ్రెస్ సీనియర్ లీడర్ - సోనియాకు అత్యంత విధేయుడు - ఆప్తుడు అయిన దిగ్విజయ్ సింగ్ పర్సనల్ లైఫ్ అప్పుడప్పుడూ బయటపడుతూ అందరికీ ఆసక్తిగా మారుతుంది. గతంలో ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపడడం... దాన్ని ఆయన సమర్థించుకోవడం.. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకోవడం వంటివన్నీ తెలిసిందే. అంతేకాదు... మాటల్లోనూ దిగ్విజయ్ కాస్త స్పీడుగానే ఉంటారు. మహిళా నాయకుల పట్లా ఆయన గతంలో టీజింగ్ కామెంట్లు చేసిన సందర్భాలున్నాయి. అయితే... ఏం చేసినా గుట్టుగా - రహస్యంగా చేయకుండా ఓపెన్ గానే ఉంటారు. దిగ్విజయ్. అది ఒక్కోసారి వివాదాస్పదం కూడా అవుతోంది. తాజాగా వరంగల్ ఉప ఎన్నికలో ప్రచారానికి వచ్చిన ఆయన అక్కడ స్థానిక నేతలు ఇచ్చిన కల్లును ఓ పట్టు పట్టారు.
వరంగల్ లో గౌడసంఘం నిర్వహించిన సభలో పాల్గొన్న దిగ్విజయ్ అక్కడ వేదికపై వారు మర్యాదపూర్వకంగా అందరికీ కల్లు పోయడంతో తానూ ఓ పట్టు పట్టారు. అయితే... ఒక సీనియర్ నేత పబ్లిక్ గా అలా మత్తు పానీయం ఎలా తాగుతారని కొందరు విమర్శిస్తుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అది తెలంగాణ ప్రజల సంస్కృతిలో కల్లు ఒక భాగమని... దిగ్విజయ్ తెలంగాణ సంస్కృతిని గౌరవించారని అంటున్నారు. కల్లు మహిమో ఏమో కానీ దిగ్విజయ్ వరంగల్ ప్రచారంలో టీఆరెస్ ను - కేసీఆర్ ను దుమ్ము దులిపేశారు. ఇచ్చిన హామీలను గాలికొదిలి సీఎం కేసీఆర్ మాటల గారడి చేస్తున్నారనివిమర్శించారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి డిప్యూటీ సీఎంగా ఉన్న దళితుడిని కూడా బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్ ను కాదని టీఆర్ ఎస్ ను గెలిపించిన ప్రజలు..ఆ పార్టీ దౌర్భాగ్య పాలన చూసి తాము తప్పు చేశామని భావిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి టీఆర్ ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదంతా విన్న టీఆరెస్ నేతలు అసలే దిగ్విజయ్... ఆపై కల్లు తాగారు అంటున్నారు.