Begin typing your search above and press return to search.

డిగ్గీతో పని కావాలంటే ఆమెను కలవాలంట

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:23 AM GMT
డిగ్గీతో పని కావాలంటే ఆమెను కలవాలంట
X
కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయల్లో ఒకటైన డిగ్గీ రాజాను కలవాలంటే అంత చిన్న విషయం కాదు. తలపండిన సీనియర్ నేత అపాయింట్ మెంట్ చాలా కష్టమని.. ఇక ఆయన్ను పని అడగాలంటే అంత తేలిక కాదన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడా పరిస్థితి లేదన్నది రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మాటగా చెబుతున్నారు. ఆ మధ్యనే డిగ్గీ రాజా తన జర్నలిస్ట్ ప్రేయసి అమృతారాయ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డిగ్గీ రాజాతో పని ఏదైనా సరే.. మేడం డిగ్గీని కలిస్తే చాలు పని పూర్తి అవుతుందని చెబుతున్నారు. అందుకే.. డిగ్గీని కలిసి ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే ముందుగా మేడం డిగ్గీతో భేటీ అయి.. ఆమెతో చర్చించి.. ఆమె చెప్పినట్లుగా వ్యవహరిస్తే పని అయిపోతుందన్న మాట ఏపీ.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ తో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అమృతారాయ్ జర్నలిస్ట్ కావటం.. ఆమెకు పార్టీ వ్యవహారాల మీద పట్టు ఉండటం మరింతగా కలిసి వస్తుందని చెబుతున్నారు.