Begin typing your search above and press return to search.
డిగ్గీరాజా మాట!..రాందేవ్ కూడా దొంగ బాబానే!
By: Tupaki Desk | 12 Sep 2017 6:45 AM GMTఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కోను ఇటీవలే అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన డిగ్గీరాజా.. కలకలమే రేపారు. పాలిటిక్స్ లో హూందా కలిగిన నేతగా మొన్నటిదాకా పేరున్న డిగ్గీరాజాకు ఇప్పుడు ఏమైందన్న కోణంలోనూ జనాలు అయోమయంలో పడిపోయారు.
ఈ వివాదం సద్దుమణిగిందో, లేదో మరోమారు ఎంట్రీ ఇచ్చిన డిగ్గీరాజా... తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను టార్గెట్ చేశారు. మోదీ అండ్ కోను దూషణలతో సరిపెట్టిన డిగ్గీరాజా... రాందేవ్ బాబాను ఏకంగా దొంగ బాబా అని పేర్కొన్నారు. డేరా బాబా అరెస్ట్, రాధేమాపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు బాబాలుగా చెప్పుకుంటున్న వారిలో నిజమైన వారు ఎవరు?, దొంగ బాబాలు ఎవరు అన్న విషయాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిన్న మీడియా ముందుకు వచ్చిన డిగ్గీరాజా... బాబా రాందేవ్ ను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో వీర విహారం చేశారు.
అఖాడా పరిషత్ జారీ చేసిన జాబితాలో రాందేవ్ బాబా పేరు లేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని డిగ్గీరాజా సెటైర్ వేశారు. అసలు డిగ్గీ రాజా వాదన ఏంటో చూస్తే... నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారట. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనట. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలని కూడా ఆయన అఖాడా పరిషత్ ను డిమాండ్ చేశారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.