Begin typing your search above and press return to search.
మోదీపై డిగ్గీరాజా రెచ్చిపోయారే!
By: Tupaki Desk | 8 Sep 2017 10:08 AM GMTఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ - ఉరఫ్ డిగ్గీ రాజా తాజాగా ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో పాటే .. ఓ ఫొటో కూడా తన ట్విట్టర్ లో పెట్టారు. ప్రస్తుతం ఇవి తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్ని నెలల కిందట.. తెలంగాణ పోలీసులు - ప్రభుత్వంపై కూడా డిగ్గీ రాజా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ముస్లిం యువకులను కావాలని తప్పుదారి పట్టించేందుకు, ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు తెలంగాణ పోలీసులు నకిటీ ఫేస్ బుక్ లు సృష్టించి వారిని ఆకర్షిస్తున్నారని, తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా మౌనంగా ఉందని అప్పట్లో సంచలనం సృష్టించారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అయితే, బహిరంగంగానే డిగ్గీ రాజాపై విరుచుకుపడ్డారు. ఆయన వయసు మీరిపోవడంతో మతి భ్రమించి అలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు తాజాగా.. డిగ్గీ రాజా ఏకంగా ప్రధాన మోదీపై కామెంట్లతో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఓ అనుచిత ఫోటో(మెమె)ను శుక్రవారం దిగ్విజయ్ పోస్ట్ చేశారు.
మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఓ రెండు వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఇది తన పోస్ట్ కాదంటూనే ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. అయితే, ఈ ట్వీట్లపై స్పందించేందుకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. మరి వాళ్లెంత ఘాటుగా స్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా గోవాలో కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు సాధించిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డిగ్గీ రాజాపై కాంగ్రెస్ చర్యలు కూడా తీసుకుంది. దీంతో ఆయన మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడే అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా వచ్చిన అవకాశాన్ని వాడేసుకున్నారు.