Begin typing your search above and press return to search.

కాశ్మీర్ ను మనకు కాకుండా చేసిన డిగ్గీరాజా

By:  Tupaki Desk   |   18 Aug 2016 12:42 PM GMT
కాశ్మీర్ ను మనకు కాకుండా చేసిన డిగ్గీరాజా
X
కాశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య వివాదమే కాదు.. ఆ ప్రాంతాన్ని ఏమని పిలవాలనే విషయంలోనూ రెండు దేశాల్లోనూ స్పష్టత ఉంది. పాక్ ఆధీనంలోని కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని అంటారు. ఇండియాలో దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. ఇండియాలో దాన్ని ఎవరూ పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అనరు. అంతేకాదు... ఇండియా మేప్ విషయంలోనూ స్పష్టమైన నిబంధనలున్నాయి. కాశ్మీర్ లోని కొంతభాగాన్ని తమ దేశంలో ప్రాంతంగా పాకిస్థాన్ చూపించుకుంటుంది. ఇండియా మ్యాప్ లోనూ కాశ్మీర్ మొత్తం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాంతం లేకుండా ఎవరైనా ఆ మ్యాప్ ను ప్రచురించినా - చిత్రించినా అది ఇండియాలో శిక్ష వేయదగ్గ నేరమవుతుంది. సాధారణ ప్రజల్లో చాలామందికి దీనిపై అవగాహన ఉండకపోవచ్చు కానీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతే బోల్తా పడితే ఏమనుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కూడా అవగాహన రాహిత్యమో లేదంటే నోరు జారారో తెలియదు కానీ కాశ్మీర్ ను భారత్ ఆక్రమిత కాశ్మీర్ గా పేర్కొని నెటిజన్లతో తిట్లు తింటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా ఆక్రమిత కాశ్మీర్ కంటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య పరిష్కారానికే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే తానన్న దాంట్లో కాశ్మీర్ ను భారత్ ఆక్రమించిందన్న అర్థం వచ్చేలా దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది. బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ దీనిపై స్పందిస్తూ దిగ్విజయ్ సింగ్ పాకిస్థాన్ సోదరీమణులకు ఇచ్చిన రాఖీ కానుక ఇది అన్నారు. దీంతో డిగ్గిరాజా తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని, కాశ్మీర్ లోయలో చెలరేగిన హింసపై పీఎం స్పందించి ప్రశాంత వాతావరణ పరిస్థితులు కల్పించేలా చూడాలని కోరడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నారు.

పీవోకే లో సమస్యలపై దృష్టిపెడుతున్న మోడీ మన కాశ్మీర్లో కల్లోలాన్ని నివారించాలని అనబోయిన డిగ్గీ ఇలా నోరు జారినట్లుగా తెలుస్తోంది. భారత్ లోని కాశ్మీర్ ను ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అనడంతో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పీవోకే మాదిరిగా ఐవోకే అన్న పదాన్ని ఇప్పుడు డిగ్గీరాజ కనిపెట్టారన్నమాట.