Begin typing your search above and press return to search.

కేసు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పిన డిగ్గీ

By:  Tupaki Desk   |   5 May 2017 5:11 AM GMT
కేసు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పిన డిగ్గీ
X
విప‌క్షాల‌కు ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని త‌న ఒక్క ట్వీట్ తో ఉలిక్కిప‌డేలా చేయ‌ట‌మే కాదు..దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌టం.. ఆపై సీరియ‌స్ కావ‌టం లాంటివాటికి కార‌ణంగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్‌ సింగ్‌. ఆయ‌న చేసిన ఒక్క ట్వీట్ తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్న క‌ల‌క‌లం అంతాఇంతా కాదు.

డి్గ్గీరాజా ట్వీట్ సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. హ‌ద్దులు దాటి మ‌రీ ట్వీట్ చేయ‌ట‌మే కాదు.. నిరాధార‌మైన అంశాల్ని ట్వీట్ తో ప్ర‌స్తావించిన దిగ్విజ‌య్ సింగ్ పై కేసు న‌మోదు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అధికారులు నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. త‌నపై కేసు న‌మోదు చేసిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం మామూలే. ఇందుకు భిన్నంగా.. త‌న‌పై కేసు న‌మోదుచేసిన తెలంగాణ అధికారుల‌కు త‌న‌దైన శైలిలో థ్యాంక్స్ చెప్పారు దిగ్విజ‌య్ సింగ్‌.

త‌న‌పై కేసు పెట్టినందుకు ధ‌న్యవాదాలు తెలిపిన దిగ్విజ‌య్‌.. తాజాగా మీడియాతోమాట్లాడుతూ మ‌రిన్ని సందేహాల్ని వ్య‌క్తం చేశారు. గ‌డిచిన ఏడాది కాలంలో తెలంగాణ పోలీసులు ఎంత‌మంది ముస్లిం యువ‌త‌ను అదుపులోకి తీసుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేయ‌ట‌మే కాదు.. ముస్లిం యువ‌త‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే మ‌జ్లిస్ పార్టీ ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ముస్లిం యువ‌కుల్ని అదుపులోకి తీసుకుంటున్న ఉదంతంలో మ‌జ్లిస్ నేత‌లు అస‌దుద్దీన్ ఓవైసీ.. అక్బ‌రుద్దీన్ ఓవైసీల నుంచి ఒక్క మాట కూడా ఎందుకు రావ‌టం లేద‌ని ప‌శ్నించారు. ముస్లిం రిజ‌ర్వేష‌న్ల పేరుతో బీజేపీకి మేలు చేయ‌టానికి.. ఓట్ల‌ను చీల్చ‌టానికే టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుందంటూ ఆరోపించారు.

డిగ్గీరాజా మాట‌ల్ని వింటే.. తాజా ట్వీట్ వెనుక కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల మైలేజీ కూడా కార‌ణం ఉంద‌న్న రాజ‌కీయ దుగ్ద‌తోనే లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌ని టీఆర్ ఎస్ నేత‌లు వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/