Begin typing your search above and press return to search.
ఆవు మాంసమే కాదు .. కుక్క మాంసం కూడా తినండి ..
By: Tupaki Desk | 5 Nov 2019 7:36 AM GMTమన ఈ భారదేశంలో ఆవులని గోమాత భావించి పూజలు చేస్తారు. ఆవులని గోమాతలుగా చూసే ఈ దేశంలోనే ఆవులని చంపి వాటి మాంసాన్ని కొంతమంది తింటున్నారు. ఆవు మాంసం తో పాటుగా గొడ్డు మాంసం కూడా చాలామంది తింటుంటారు. ఆవులని చంపి వాటి మాంసం తినవద్దు అని ఎన్నో ధర్నాలు కూడా చేసారు. ఆవులని చంపుతున్నారనే విషయంలో దేశంలో ఎన్నో అల్లర్లు కూడా జరిగాయి. ఆవులని చంపి తింటే హిందువులను కించపరినట్టే ... ఆవుల చంపడం మానుకోవాలని ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అలాగే కేంద్రం కూడా ఆవులని చంపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించిన తెలిసిందే. అయినప్పటికీ మనదేశంలో ఆవులను చంపడం మాత్రం ఆగడంలేదు.
దీనిపై తాజాగా పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తనదైన శైలి స్పందించారు. మేథావుల మని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రోడ్డు పక్కన ఉండే దుకాణాల్లో బీఫ్ తింటున్నారనీ, వారు తినేది రోడ్డు పక్క షాపుల్లో బహిరంగంగా ఎందుకు తినటం..ఇళ్లకెళ్లి తినొచ్చు కదా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఆరోగ్యానికి మంచిదని అంటున్న సదరు మేథావి వర్గం ఆరోగ్యంగా ఉంటుందంటే బీఫే కాదు కుక్క మాంసం కూడా తినండి..మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. భరతమాత పవిత్ర గడ్డపై ఆవులను చంపడం, బీఫ్ తినడం నేరం అని తెలిపారు. భారతీయ జాతి ఆవుల ప్రత్యేక లక్షణం ఉంది..దాని పాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటి పాలు రంగు కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది అని తెలిపారు . తల్లిలాంటి ఆవుని తినటం నేరం కాక మరేమిటని ప్రశ్నించారు.