Begin typing your search above and press return to search.
నటి కిడ్నాప్ : దిలీప్ డీల్ 3 కోట్లట
By: Tupaki Desk | 28 Sep 2017 5:57 AM GMTహీరోయిన్ ను రేప్ చేసే విలన్లను అడ్డుకొని.. వారి ఆటకట్టించటం హీరో అలవాటు. ఇది సినిమాల్లో చూసే సీన్. కానీ.. రీల్‌కు భిన్నమైన సీన్ రియల్ లైఫ్ లో చోటు చేసుకుంది. తెర మీద తన వీరోచిత పోరాటాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఒక ప్రముఖ నటుడు ఎంత దుర్మార్గంగా ఆలోచించారన్న విషయాన్ని అక్కడి పోలీసులు కేరళ కోర్టుకు చెప్పిన సమాచారం విని న్యాయమూర్తులకు షాక్ తిన్నంత పనయ్యింది. ఇంతకీ ఆ హీరో టార్గెట్ ఒక హీరోయిన్ కావడం గమనార్హం. కొంతకాలం క్రితం మలయాళ నటిని కిడ్నాప్ చేసి.. కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ దారుణానికి సంబంధించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పక్కా సమాచారాన్ని రాబట్టి ఈ కిడ్నాప్ ఉదంతం వెనుకనున్న వ్యక్తి అయిన మలయాళ ప్రముఖ హీరో దిలీప్ ను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నివేదిక రూపంలో పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
కిడ్నాపర్ పల్సర్ సునికి దిలీప్ ఈ పని అప్పగించారు. ఈ డీల్ కు కోటిన్నర రూపాయలను ఆఫర్ చేశారు. ఒకవేళ పోలీసులకు దొరికి జైలుపాలైతే మరో కోటిన్నర అదనంగా ఇస్తానని కూడా దిలీప్ హామీ ఇచ్చినట్లు నిందితులు వెల్లడించారట. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణంలో తన కారులో వెళుతున్న నటిని అడ్డగించి... కిడ్నాప్ చేసి దాదాపు రెండు గంటల పాటు లైంగిక దాడికి పాల్పడిన నిందితులు తర్వాత ఆమెను వదిలేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో వారు ఈ విషయాన్ని అంగీకరించారు.
అయితే, ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను జులైలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ రెండు సార్లు బెయిల్ కోసం దిలీప్ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా.. రెండుసార్లు కోర్టు తిరస్కరించింది. మళ్లీ మూడోసారి తాజాగా హై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా నటి కిడ్నాప్ వెనుకనున్న భారీ డీల్ ను పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరి.. సదరు నటుడికి బెయిల్ దొరుకుతుందా? కోర్టు ఏదైనా శిక్ష విధిస్తుందా అన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.