Begin typing your search above and press return to search.
నగ్న వీడియో తే.. రూ.1.5 కోట్లు తీసుకో
By: Tupaki Desk | 19 July 2017 11:12 AM GMTమలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తూ స్టార్ హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అతడికి బెయిల్ కూడా నిరాకరించింది. దిలీప్ ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ని కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పల్సర్ సుని నుంచి కూడా పోలీసులు కీలక సమాచారం రాబట్టాడు. ఈ రెండు సమాచారాల్ని క్రోఢీకరించగా.. అసలు ఆ కిడ్నాప్ సమయంలో.. దానికి ముందు.. తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులకు పూర్తి అవగాహన వచ్చినట్లుగా చెబుతున్నారు.
కేరళ మీడియా కథనాల ప్రకారం దిలీప్.. హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఆమె నగ్న వీడియోలు తీస్తే రూ.1.5 కోట్లు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వీడియోను బయటికి లీక్ చేయకూడదని.. మార్ఫింగ్ చేయకూడదని.. ఉన్నదున్నట్లుగా తీసుకురావాలని అతను చెప్పినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ముఖం స్పష్టంగా కనిపించాలని.. ఆమె చేతికి ఉన్న ఉంగరం కూడా కనిపించేలా వీడియో తీయాలని.. ఇలా కొన్ని షరతులు విధించాడట. తాను చెప్పిన ప్రకారం వీడియో తీసుకుని వస్తే రూ.1.5 కోట్లు అందుకోవచ్చని చెప్పాడట. కానీ హీరోయిన్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించడం.. పల్సర్ సుని సహా నిందితుల్ని పోలీసులు వేగంగా అరెస్టు చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఒప్పందం ప్రకారం తనకు ఇస్తానన్న రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పల్సర్ సుని.. దిలీప్ కు లేఖ కూడా రాసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే హీరోయిన్ కు సంబంధించిన వీడియో ఉన్న మెమొరీ కార్డు కోసం పోలీసుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. అదెక్కడుండన్నది ఇంకా తెలియట్లేదు.