Begin typing your search above and press return to search.

మహా నూతన హోం మంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్..!

By:  Tupaki Desk   |   6 April 2021 11:08 AM GMT
మహా నూతన హోం మంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్..!
X
మహారాష్ట్ర నూతన హోమంత్రిగా ఎన్సీపీ నాయకుడు దిలీప్ వాల్సే పాటిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు సీఎం ఉద్దవ్ థాక్రే గవర్నర్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మహా హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఆయన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రే ఆమెదించి... అనంతరం గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి పంపించారు.

ఉద్దవ్ థాక్రే ప్రస్తుత కేబినెట్లో దిలీప్ వాల్సే ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు. హోం మంత్తి పదవి దృష్ట్యా ఈ బాధ్యతలను డిప్యూటి సీఎం అజిత్ పవార్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా హోం మంత్రిత్వ శాఖకు ఈ పేరు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. దిలీప్ వాల్సే ప్రత్యేకతలపై ఆందరికీ ఆసక్తి నెలకొంది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే దత్తాత్రేయ్ కుమారుడు దిలీప్ వాల్సే, శరద్ పవార్ పీఏగా తన కెరీర్ ప్రారంభించారు. 1990లో కాంగ్రెస్ నుంచి అంబేగావ్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. 1999లో ఎన్సీపీలో దిలీప వాల్సే చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.
కొద్దిరోజులకే విలాస్ రావు దేశ్ముఖ్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2009 నుంచి 2014 వరకు అసెంబ్లీ సభాతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలా దిలీప్ వాల్సేకు రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే మహా సీఎం ఉద్దవ్ థాక్రే పేరును పరిశీలించారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు ఘటన కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు మహా రాజకీయాల్లోకి వచ్చింది. సచిన్ వాజేపై ప్రభుత్వం వేటు వేసింది, పరమ్ వీర్ సింగ్ పై బదిలీ వేటు వేసింది. తనపై అకారణంగా వేటు వేశారని పేర్కొంటూ.. అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోపణలు చేస్తూ ఉద్దవ్ కు మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ లేఖ రాశారు. ముంబయి ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ అనిల్ దేశ ముఖ్ రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నడుమ పదవిలో కొనసాగడం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను మహా సీఎం ఉద్దవ్ థాక్రే ఆమెదించి గవర్నర్కు పంపించారు.