Begin typing your search above and press return to search.

సైకిల్ చీలిక‌...రంగంలోకి తోటికోడ‌ళ్లు

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:38 AM GMT
సైకిల్ చీలిక‌...రంగంలోకి తోటికోడ‌ళ్లు
X
యూపీలో అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో చీలిక అనివార్యమైన పక్షంలో కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కేందుకు యూపీ సీఎం అఖిలేష్ ముమ్మర ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి కుమార్తె ప్రియాంకతో అఖిలేష్ భార్య డింపుల్ చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కోసం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమసిపోకపోతే, పార్టీలో చీలిక అనివార్యమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి తన తండ్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ తో కుస్తీ పడటంలో తీరిక లేకుండా ఉన్న ఆయన ఇందుకోసం తన భార్య డింపుల్ యాదవ్(38)ను రంగంలోకి దింపారు. సీఎం అఖిలేష్ స‌తీమ‌ణి అయిన డింపుల్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. 2012లోక్ స‌భ ఎన్నికల్లో ఆమె ఎంపీ అయ్యారు. పార్లమెంటులోనూ బయటా ఆమె అరుదుగానే మాట్లాడారు. భర్త అఖిలేశ్ వెంటే ఎక్కువగా ఉండటానికి ఆమె పరిమితమయ్యారు.

తండ్రి ములాయం సింగ్‌ తో పాటు ముఖ్యంగా చిన్నాయిన శివపాల్ - అమర్ సింగ్‌ ల‌ను తప్పించి పార్టీని పూర్తిగా తన వశం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా డింపుల్‌ కు రాజకీయాల్లో పెద్ద పాత్ర అప్పగించాలని అఖిలేశ్ యోచిస్తున్నారు. అందుకే డింపుల్‌ కు కాంగ్రెస్ పార్టీతో స్నేహం పెంపొందించే బాధ్యతలను అప్పగించారని, ఆమె ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీని ఢిల్లీలో కలిసి మాట్లాడారని తెలుస్తున్నది. ఇటీవలే ఆయన ఇందుకోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ప్రియాంకకు కాంగ్రెస్‌ లో ఎలాంటి హోదా లేకున్నా నెహ్రూ కుటుంబానికి చెందినందున ఆమె మాటకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని కాబట్టి రాహుల్ తో పాటు ఆమె సాయం కూడా పొందాలన్నది అఖిలేశ్ వ్యూహం. పొత్తు కుదిరితే ప్రియాంకతోపాటు - డింపుల్ తో ఎన్నికల్లో ప్రచారం చేయిస్తే తమకు విజయం తథ్యమని ఆయన అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/