Begin typing your search above and press return to search.
యోగి ప్రభుత్వంలో మంత్రి రాజీనామాకు అదే కారణమా?
By: Tupaki Desk | 20 July 2022 11:48 AM GMTఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. యోగి మంత్రివర్గంలో జలశక్తి శాఖ సహాయ మంత్రిగా ఉన్న దళిత నేత దినేష్ ఖటిక్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అంతేకాకుండా తన రాజీనామాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపారు.
దినేష్ ఖటిక్.. అమిత్ షాకు రాసిన లేఖలో తనకు 100 రోజులుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి పని అప్పగించలేదని ఆరోపించారు. శాఖాపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని తనను తప్పు పట్టారని విమర్శించారు. అందుకు బాధతో రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను దళితుడిని కాబట్టే తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు, మంత్రిగా తనకు ఎలాంటి అధికారం లేదని వాపోయారు. తనను ఏ సమావేశానికి పిలవడం లేదన్నారు. ఇది దళిత సమాజాన్ని అవమానించడమేనని ఆ లేఖలో ఖటిక్ పేర్కొన్నారు.
అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా ముఖ్యమంత్రి యోగిపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద కూడా యోగిపై ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండా తన శాఖలో ఒక ఐఏఎస్ అధికారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
తన శాఖలో బదిలీల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ యోగి ప్రభుత్వం ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. జితిన్ ప్రసాద కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా ఉన్న అనిల్ కుమార్ పాండే బదిలీలు, పోస్టింగుల కోసం లంచం తీసుకున్నారని ఆయనను యోగి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో జితన్ ప్రసాదను కూడా వీటిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ఇదే విషయంపై సీఎం యోగి తనను ప్రశ్నించారని జితిన్ ప్రసాద విమర్శించారు. అంతేకాకుండా పీడబ్ల్యూడీ శాఖలో అవినీతిపై విజిలెన్సు విచారణకు కూడా ఆదేశించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో జితిన్ ప్రసాద కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఇరకాటంలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు మాత్రమే అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందులోనూ పార్లమెంటు ఎన్నికలకు రెండేళ్లకు మించి సమయం లేని పరిస్థితుల్లో అసమ్మతి జ్వాలలు రేగడంపై బీజేపీ ఆందోళన చెందుతోందని చెబుతున్నారు.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తోంది. అసంతృప్తిని చల్లార్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది. బుజ్జగింపులు సైతం మొదలు పెట్టింది.