Begin typing your search above and press return to search.

ఆ యాప్ తో కాల్ చేస్తే కనిపెట్టడం ఖాకీలుకూ సవాలే !

By:  Tupaki Desk   |   23 Oct 2020 11:30 AM GMT
ఆ యాప్ తో కాల్ చేస్తే కనిపెట్టడం ఖాకీలుకూ సవాలే !
X
మహబూబాబాద్ లో దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఫోన్ కాల్స్ ట్రేస్ చేయడం, నెంబర్ ఆధారంగా, వాడుతున్న మొబైల్ ఆధారంగా అన్ని సమాచారాలు సేకరించడంలో పోలీసులు దిట్ట. హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి కేసుకు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు మంద సాగర్ డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ ద్వారా దీక్షిత్ రెడ్డి తండ్రికి ఫోన్ చేసాడట. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ చేసారంటే ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తించడం చాలా కష్టం. పోలీసులకు కూడా అది అసాధ్యమే. అందుకే మంద సాగర్ తెలివిగా బాలుడి తండ్రికి యాప్ ద్వారా కాల్ చేశాడు. ఆ యాప్ ద్వారా కాల్ చేయడం వల్లే పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తించలేకపోయారు.

సాగర్ చదివింది 7వ తరగతి మాత్రమే... కానీ, టెక్నాలజీ పట్ల మాత్రం అతడు అవగాహన బాగా పెంచుకున్నాడు.. గతంలో మంద సాగర్ ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకొని కాల్స్ ద్వారా ఒక యువతిని వేధించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పుడు కూడా అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఆ కేసు ఇప్పటికీ కూడా పెండింగులోనే ఉంది.

నిందితుడు మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా ఫోన్ చేయడం వల్లే పోలీసులకు 3 రోజులు పాటు కేసు సవాలు గా మారింది. మహబూబాబాద్ కు చెందిన మనోజ్ రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డిని అదే ప్రాంతానికి చెందిన మంద సాగర్ ముందుగా బాలుడికి మాయ మాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడిని చంపి పెట్రోలు పోసి తగల బెట్టాడు.ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.