Begin typing your search above and press return to search.
ఏంటి బ్రదర్... 40 ఏళ్లుగా 8 వేల రెస్టారెంట్లలో భోజనమా..!!!
By: Tupaki Desk | 27 Nov 2021 7:21 AM GMTరుచికరమైన వంటకాలు తినడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు భోజనప్రియులు. వారికి కావాల్సిన ఆహారం దొరికేంత వరకూ వారి వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా రుచికరమైన ఆహారం తినడానికి మనలో చాలా మందే రెస్టారెంట్లను ఎంచుకుంటారు. అయితే ప్రతిరోజు తినలేము కావున వారానికి ఒకటి లేదా రెండు సార్లు రెస్టారెంట్లకు వెళుతుంటారు.
ఈ సమయంలోనే తిన్న తర్వాత వచ్చే బిల్లును చూసి వామ్మో తడిసి మోపెడు అయిందని అనుకుంటూ ఉంటారు మనలో చాలా మంది. అయితే అమెరికాలో నివసించే చైనాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇప్పటివరకు సుమారు 8 వేల రెస్టారెంట్లలో వివిధ రకాలైన వంటకాలను రుచి చూశారు. అవును నిజమే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8వేల హోటళ్లలో ఆయన తిన్నారట!
ఇదంతా కేవలం రెండు మూడు సంవత్సరాల్లో అనుకుంటే పొరపాటే. సుమారు నలభై సంవత్సరాలుగా డేవిడ్ చాన్ అనే ఈ వ్యక్తి తన ఫుడ్డు జర్నీ ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఎనిమిది వేల రెస్టారెంట్లలో ఆయన రుచి చూసినా వంటకాల సంఖ్య అనేకమనే చెప్పాలి. అయితే డేవిడ్ వెళ్లిన 8వేల రెస్టారెంట్లు చాలా వరకూ చైనీయులకు సంబంధించినవి కావడం విశేషం.
చైనా మూలాలు ఉన్న వ్యక్తిగా డేవిడ్ తన గుర్తింపును పెంపొందించుకునేందుకు ఈ వైరెటీ కాన్సెప్ట్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. వృత్తిపరంగా తానొక న్యాయవాదినని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే వివిధ చైనీస్ రెస్టారెంట్లు ఇప్పటివరకు చాలా వాటిని తాను కవర్ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే చైనా సంప్రదాయ వంటకాలను అన్నింటినీ రుచి చూసినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు డేవిడ్ వెళ్లిన ప్రతి రెస్టారెంట్ జ్ఞాపకాలను ఇప్పటికీ తన లాప్ టాప్ లో పొందు పంచుకున్నట్లు అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు అంతేకాకుండా అక్కడ లభించే మెనూను కూడా తన వెంట తీసుకు వచ్చే వారని పేర్కొన్నారు. వెళ్లిన ప్రతిచోటా ఆ రెస్టారెంట్ కు సంబంధించిన బిజినెస్ కార్డులు కూడా తన వెంట తెచ్చుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇటువంటి కలెక్షన్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేదని అభిప్రాయపడుతున్నారు. వంటకాల వరకు తానేమీ గొప్ప విమర్శకుల్ని కాదని డేవిడ్ చెబుతున్నారు. అయితే తాను ఫుడ్ లవర్ ని కూడా కాదని ఈ క్రమంలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ తాను చైనా కు సంబంధించిన అన్ని సంప్రదాయ, మోడరన్ వంటకాలను రుచి చూసినట్లు వెల్లడించారు.
చైనా మూలాలున్న డేవిడ్ కు మొదటగా ఆ ఆదేశ ఆహారపు అలవాట్లను వారి తల్లిదండ్రులు నేర్పించలేదని డేవిడ్ చెప్పారు. అందుకే ఒక్కొక్కసారి ఎన్నో తాను వెతుక్కుంటూ ఆ రుచులను ఆస్వాదిస్తూ ఉన్నానని పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 45 వేలకు పైగా చైనా రెస్టారెంట్ లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే తాను చనిపోయే లోపు కనీసం వాటిలో సగానికి పైగా రెస్టారెంట్లను కవర్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తొలినాళ్లలో చైనా కు సంబంధించిన సంప్రదాయ ఆహారం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని వివరించారు కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో చైనా హాంకాంగ్ నుంచి వలసలు భారీగా అమెరికాకు పెరిగినట్లు గుర్తు చేశారు.
దీంతో రెస్టారెంట్లు సంఖ్య కూడా అమాంతం పెరిగిందని చెప్పారు. ఈ హడావుడి జీవితాల్లో భోజనానికి వెచ్చించే సమయం చాలా తక్కువ అని ఆయన చెప్పారు. దీనిని పెట్టుబడిగా చేసుకొని ఆహార సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది ఆయన గుర్తు చేశారు ఈ క్రమంలోనే అమెరికాలో 45వేల రెస్టారెంట్లు పుట్టుకొచ్చినట్లు పేర్కొన్నారు.