Begin typing your search above and press return to search.
ఇకనైనా మారండి'...ఐక్యరాజ్యసమితిలో 'డైనోసార్' ప్రసంగం , వీడియో వైరల్!
By: Tupaki Desk | 28 Oct 2021 10:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఏకైక సమస్య అంటే కరోనా అని చెప్తారు. కానీ అంతకంటే పెద్ద సమస్య కాలుష్యం. వాతారవణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కాలుష్యాన్ని పెంచే శిలాజఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాలు ఏవీ కూడా పాలించడం లేదు. దీనిపై ఐరాస జనరల్ అసెంబ్లీలోకి ప్రవేశించిన డైనోసార్ ప్రపంచ దేశాలను ఉద్దేశించి మాట్లాడింది. ప్రపంచ దేశాలు వినాశనం వైపు పయనిస్తున్నాయని, తన మాట వినాలని కోరింది. వినాశనాన్ని ఎంచుకోకండి… మానవ జాతిని రక్షించుకోండి అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చింది.
డైనోసార్ మాట్లాడుతుందా , అసలు డైనోసార్ వస్తే పారిపోకుండా అక్కడే నిల్చొని మాట్లాడుతున్నారా అనే అనుమానం రావచ్చు. అయితే త్వరలో పర్యావరణంపై ప్రపంచ దేశాల సదస్సు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐరాస చిన్న వీడియోను రూపొందించింది. మనుషులు ఎలా పయనిస్తున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో తెలియజేసేందుకు ఈ వీడియోను రూపొందించారు.
ప్రజలారా వినండి..అంటూ మొదలుపెట్టింది. అవును.. మీరు చదువుతున్నది నిజమే.రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది కదా. మనం వాడే శిలాజ ఇంధనాలతో కర్బన ఉద్గారాలు గాల్లో కలిసి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వాటి వాడకాన్ని తగ్గించాలని, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని లక్ష్యాన్నీ ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. అయితే, ఈ పర్యావరణ మార్పులపై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో.. జనం అనే మనం కూడా అంతరించిపోతామని హెచ్చరిక ఇప్పించింది. గ్రాఫిక్స్ తో ఓ డైనోసార్ ను రూపొందించి.. నిజంగా ఓ డైనోసార్ మనముందు మాట్లాడుతోందన్న భ్రాంతిని కలిగించింది.
ఇంతకీ ఆ డైనోసార్ వీడియో లో ఏం చెప్పిందంటే .. ప్రజలారా వినండి! మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారు. పెద్ద పెద్ద ఉల్కలపై అంతే మొత్తాన్ని మనం ఖర్చు చేస్తున్నామనుకోండి.. ఏమవుతుంది ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వాలు లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలో జీవిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు.. ఇలాంటి పేదలకు సాయం చేస్తే బాగుంటుందనిపించలేదా ఎప్పుడూ మీ అంతం కోసం మీరే డబ్బులు ఖర్చు చేసుకుంటారా ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహమ్మారి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే మీ ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకుంటున్నారు. కాబట్టి మీకిదే నేనిచ్చే ఓ మంచి సలహా. మీ అంతాన్ని మీరే కోరుకోకండి. సమయం మించిపోకముందే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పటికైనా మార్పులను ఆహ్వానించండి.. మారండి. దాని నుంచి తప్పుకునేందుకు వంకలు వెతుక్కోవద్దు. థాంక్యూ’’ అంటూ ఆ గ్రాఫిక్స్ డిజైనర్ డైనోసార్ తన ప్రసంగాన్ని ముగించేసింది

We can no longer ignore the climate crisis.
— United Nations (@UN) October 27, 2021
It's time to stop making excuses and start making changes!
Let's take #ClimateAction before it’s too late: https://t.co/UaBpA8VLbn
via @UNDP #DontChooseExtinction pic.twitter.com/y2zZsSc0lB