Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు సీమాంధ్ర సినిమాలపైనే ప్రేమా?
By: Tupaki Desk | 10 Jan 2017 8:09 AM GMTఅన్ని రంగాల్లోనూ తెలంగాణ ముద్ర ఉండాలనే సీఎం కేసీఆర్ సినిమాల విషయానికొచ్చేసరికి సీమాంధ్రులకే ప్రయోజనం కల్పిస్తున్నారని తెలంగాణకు చెందిన దర్శకుడు రఫీ ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడి నిర్మాతలు, దర్శకుల గోడు పట్టించుకోవడం లేదని రఫీ ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలకు, చారిత్రక పోరాటాలను తెరకెక్కించిన చిత్రాలకు - తక్కువ బడ్జెట్ లో రూపొందిన చిత్రాలకు పన్ను మినహాయింపులు లేవు సరికదా, కనీసం థియేటర్లు కూడా లభించడం లేదని వాపోయారు. సీమాంధ్ర నిర్మాతలు తీసిన పెద్ద చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపులను క్షణాల్లో మంజూరు చేస్తోందని ఆయన ఫైరయ్యారు.
రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పన్ను మాఫీ ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించిన ఆయన, అసభ్య, అసహజ సన్నివేశాలు ఉన్నాయా? లేవా? అని కూడా చూడకుండా ప్రభుత్వం జీవోలు ఇస్తోందని, వేరుపడ్డాక కూడా తెలంగాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలు వెంటనే అమలయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు.. అప్పుడే నయమని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు సైతం సీమాంధ్ర నిర్మాతల చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించాడు. ప్రభుత్వ వైఖరి తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, తెలంగాణ నిర్మాత - దర్శకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/