Begin typing your search above and press return to search.
ఎప్పుడూ ఫేస్బుక్లో ఉంటున్నారా.. జర భద్రం
By: Tupaki Desk | 29 Sep 2020 1:30 AM GMTస్మార్ట్ఫోన్లు వచ్చాక సామాజిక మాధ్యమాల వాడకం విపరీతంగా పెరిగింది. కొద్దిపాటి డిజిటల్ జ్ఞానం ఉన్నవారు సైతం 24 గంటలూ ఫేస్‌బుక్ , వాట్సాప్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లోనే ఉంటున్నారు. ఆఫీసుల్లో, బస్టాండ్‌లో, పనివేళల్లో నిరంతరం ఫేస్‌బుక్ లోనే నిమగ్నమైపోతున్నారా? నిద్రలేవగానే.. నా పోస్టుకు ఎంతమంది లైక్ కొట్టారో అని వేచిచూస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిరంతరం ఫేస్‌బుక్ చూస్తూ కుర్చొంటే నెగెటివ్ ఎఫెక్ట్ (ప్రతికూల దృక్పథం) ఎక్కువ అవుతుందని అది మన మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్ 2016 డేటా ప్రకారం.. ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి రోజుకు యావరేజ్ గా 50 నిమిషాల పాటు ఫేస్‌బుక్‌లోనే ఉంటున్నాడట. అదే క్రమంలో ఇతర స్టడీలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఎలాంటి హాని చేస్తున్నాయోనని ఫేస్‌బుక్ కు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ను బయటపడుతున్నాయి.
2013, 2014, 2015 మూడు వేవ్స్‌లలో జరిపిన కొత్త స్టడీలో 5వేల 208 సబ్జెక్టులను ఎంటర్ చేశారు. యూఎస్ పాపులేషన్ శాంపుల్ రిప్రజంటేటివ్ కింద ఒక్కో వేవ్ ఫేస్‌బుక్ యాక్టివిటీని రెండేళ్ల పాటు మానిటర్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, నికోలస్ ఏ క్రిస్టాకిస్ ఆఫ్ యేల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ఫేస్‌బుక్ నెగిటివ్ ఎఫెక్ట్ గురించి పరిశోధనలు జరిపారు. ఫేస్‌బుక్ తో ఏర్పడే పరిచయాలు నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. సోషల్ మీడియా వాడకమే జీవితంపై చెడు ప్రభావం చూపిస్తుందని స్టడీ కన్ఫామ్ చెప్పింది.
సోషల్ మీడియా లింక్ ను క్లిక్ చేయడం, స్టేటస్ అప్‌డేట్ చేయడం, లైక్ కొట్టడం, సెల్ఫ్ రిపోర్టెడ్ మెంటల్ హెల్త్ పై ఐదు నుంచి 8శాతానికి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ద హార్వార్డ్ బిజినెస్ రివ్యూ రచయితలు శక్యా, క్రిస్టాకిస్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్ కంటే ఆన్లైన్ ఇంటరాక్షన్ మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని. దీనివల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి రోజులో ఒకసారో రెండోసార్లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేస్తే పరవాలేదు కానీ.. నిరంతరం ఫేస్బుక్లో ఉంటే మాత్రం ప్రమాదం పొంచిఉన్నట్టే.