Begin typing your search above and press return to search.
టీకా వేసుకుంటే మద్యంపై 10శాతం డిస్కౌంట్ .. ఎక్కడంటే
By: Tupaki Desk | 25 Nov 2021 3:30 AM GMTకరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే, కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నో ఆఫర్లు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్బంధంగా టీకాలు వేస్తుంటే, మరికొన్ని దేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకా వేయించుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా కాంపైన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే మందసౌర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ లోని మందాసోర్ జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు వినూత్నమైన పథకం ప్రవేశపెట్టారు.
తమ పరిథిలో ఉన్న మద్యం షాపుల్లో, 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికేట్ చూపిస్తే, 10శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎక్కువమంది మందుబాబులే రెండో డోసుకు విముఖత చూపిస్తున్నట్టు స్థానికంగా చేసిన సర్వేలో తేలింది. అలాంటి వాళ్లందర్నీ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఎక్సైజ్ శాఖ ఈ డిస్కౌంట్ ప్రకటించింది. సీతామోపాటక్, భునియాకేడీ లాంటి ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. స్థానికంగా ఇది సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఆలోచనలు చేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగిలిన చోట్ల అమలుపరుస్తామని అంటున్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ సిసోడియా కామెంట్ చేస్తూ నిర్ణయం సరైంది కాదని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, మద్యం సేవించడాన్ని ప్రోత్సహించేదిలా ఉందని విమర్శించారు. అంతకంటే ముందు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మద్యం తీసుకునే వారిని ప్రేరేపించేదిలా నిర్ణయం ఉందని తిట్టిపోశారు. అర్హత కలిగిన వారందరికీ డిసెంబర్ ముగిసేనాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఈ నెల కంటే ముందు జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఖండ్వా జిల్లా ఆర్పీ కిరార్ మద్యం కొనుగోలు చేయాలంటే ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపించాలని అన్నారు.