Begin typing your search above and press return to search.

నగదు రహితానికి రాయితీల దారి

By:  Tupaki Desk   |   14 Dec 2016 7:12 AM GMT
నగదు రహితానికి రాయితీల దారి
X
నగదు రహిత లావాదేవీలపై ఇంతవరకు విరుచుకుపడుతున్న భారత జనం కేంద్రం కార్డు ద్వారా చెల్లింపులపై ప్రకటించిన రాయితీలు - కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో కాస్త కుదుటపడుతున్నారు. పెట్రోల్‌ - డీజిల్‌ తో పాటు మరికొన్ని నిత్యావసరాల కొనుగోలుకు కార్డుల్ని వినియోగిస్తే 0.75శాతం రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో పాటు బంకులు - సూపర్‌ మాల్స్‌ వద్ద కార్డుల విని యోగం అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు కార్డుల ద్వారా కొనుగోలును నిరసించిన వినియోగదార్లు కూడా ఇప్పుడు అటువైపే మొగ్గుచూపు తున్నారు. జేబుల్లోని కార్డులకు పనిపెడుతున్నారు. కేంద్రమిచ్చిన వెసులు బాటును ఎందుకు తాము వినియోగించుకోకూడదన్న ఆలోచన ప్రతి వినియోగదారుడిలోనూ తలెత్తుతోంది.

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనిశ్చితస్థితి నెలకొంది. బ్యాంకులో సొమ్మున్నా చేతిలో డబ్బుల్లేక ప్రజలు నానా అవస్తలకు గురౌతున్నారు. గంటలకొద్దీ ఎటిఎమ్‌ ల ముందు క్యూలైన్లలో నిలబడి కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అంచెల వారీగా కరెన్సీ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్‌ మనీ వినియోగాన్ని పెంచితే పన్నుల వసూళ్ళు సక్రమమౌతుంది.. అవినీతికి అడ్డుకట్టేసే విలౌతుందన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రక్రియ ఇంతవరకు వీరిని ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఈ ఇబ్బందుల్నుంచి గట్టెక్కేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నానారకాల ప్రయత్నాలు చేశాయి. అనేక రకాలుగా ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాయి. కానీ అవేవీ సఫలం కాలేదు. ఈ దశలో కేంద్రం ప్రకటించిన 0.75శాతం రాయితీ వీరిపై బ్రహ్మాస్త్రంలా పని చేస్తోంది. ప్రకటన వెలువడ్డ కొన్నిగంటల్లోనే సానుకూల ఫలితాలు మొదలయ్యాయి.

నిజానికి ప్రపంచంలో క్యాష్ లెస్ దేశాలుగా పేరు పడిన వన్నీ ఒక్క రోజులో ఇదంతా సాధించేయలేదు. మన మాదిరిగా రాయితీలు - పన్నుల మినహాయింపు వంటివి ప్రవేశపెట్టి ప్రోత్సహించాయి. అయితే.. ఐటీ విప్లవం కొన్ని దేశాల్లో ఇదేమీ అవసరం లేకుండా క్యాస్ లెస్ సమాజాన్ని సృష్టించింది. కానీ... 70 శాతం పైగా క్యాష్ లెస్ గా మారిన దేశాలన్నీ మాత్రం ఏదో ఒక స్థాయిలో రాయితీలు ఇచ్చినవే. ఇప్పుడు అదే అనుభవంతో ఇండియా కూడా రాయితీలతో నగదు రహితాన్ని పరుగులు పెట్టించబోతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/