Begin typing your search above and press return to search.
సింధుకు సన్మానం..చానుకు లేదేం.. ఏంటీ వివక్ష మోడీజీ?
By: Tupaki Desk | 5 Aug 2021 5:30 AM GMTకేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరిలోనూ బోలెడు అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వివక్ష అనేది మరోసారి బయటపడుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బ్రాంచ్ మెడల్ సాధించి ఇండియాకు తిరిగివచ్చిన పీవీ సింధు విషయంలో ఈ విషయం స్పష్టమైంది.
టోక్యో నుంచి ఢిల్లీకి మంగళవారం వచ్చిన పీవీ సింధు విషయంలో కేంద్రం చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. విమానాశ్రయంలోనే బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్వయంగా పీవీ సింధుకు ఘనస్వాగతం అందించింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఘనంగా సత్కరించారు.
ఒక్క ఠాకూరే కాదు.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, క్రీడాశాఖ సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ తోపాటు చాలా మంది ఎంపీలు పీవీ సింధును సన్మానించేందుకు పోటీపడ్డారు. అయితే సింధు సాధించింది కేవలం ‘కాంస్య’పతకం మాత్రమే. దానికే ఇంత హంగామా చేశారు.
అయితే ఇదే టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో మీరాభాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. కాంస్యం కంటే పెద్దది.. అయినా కూడా ఆమెను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతటి భారీ స్వాగతం విమానాశ్రయంలో ఆమెకు దక్కలేదు. ఇక ప్రభుత్వం తరుఫున కేంద్రమంత్రులు ఎవరూ పాల్గొనలేదు. సింధుూకు జరిపినట్లు చానును అభినందించిన పాపాన పోలేదు. ఏంటీ వివక్ష అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
క్రీడలన్నీ సమానమే.. కానీ షటిల్ కు ఉన్న పాపులరాటీ వెయిట్ లిఫ్టింగ్ లేదు. కానీ పతకం ఏది సాధించిందన్నది ముఖ్యం., అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికుంది. పైగా సింధూ సాధించింది బ్రాంజ్ మెడల్ మాత్రమే. చాను తెచ్చింది సిల్వర్ మెడల్ అన్నది మరిచిపోకూడదు. ఇప్పటికైనా కేంద్రం ఇలాంటి పక్షపాతం చూపకపోతే మంచిదని సూచిస్తున్నారు