Begin typing your search above and press return to search.
సంప్రదాయ ఓట్లు ఏమైనట్టు.. టీడీపీలో చర్చ..!
By: Tupaki Desk | 12 Dec 2021 2:30 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందనేది వాస్తవం. 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి గ్రామీణ, పట్టణ, నగరాల్లో.. టీడీపీకి బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పార్టీ విజయం దక్కించుకుంటోంది. అంతేకాదు.. చాలా నియోజకవర్గాల్లోనూ టీడీపీ వరుస పెట్టి విజయం దక్కించుకుంటోంది. నాయకులు ఎవరైనా కూడా టీడీపీ విజయం ఖాయం.. ఇదంతా కూడా సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగానే జరుగుతోందనే విషయం తెలిసిందే.
అయితే.. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ.. ఈ సంప్రదాయ ఓటు బ్యాం కు ఏమైందనేది చర్చగా మారింది. ఎందుకంటే.. బలమైన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ సత్తా చాటలేక పోయింది. గెలుస్తారు.. అని నిర్ణయించుకున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేసిం ది. దీంతో అసలు సంప్రదాయ ఓటు ఉందా? లేక.. గాడితప్పిందా ? అనే చర్చ సాగింది. ఇది కొన్నాళ్ల కిందటి వరకు సాగినా.. తర్వాత.. మళ్లీ ఎందుకో పక్కకు పోయింది. ఏపార్టీకైనా.. సంప్రదాయ ఓటు బ్యాంకే కీలకం.
ఈ నేపథ్యంలో టీడీపీ ఆది నుంచి పెంచుకున్న ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయిందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓటు బ్యాంకు సొంతమైంది. అదేసమయంలో టీడీపీకి 36 శాతం ఓటు బ్యాంకు లభించింది. అయితే.. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ.. పరిషత్ ఎన్నికల్లోనూ(అదికారికంగా దూరంగా ఉన్నప్పటికీ.. పార్టీ నేతలు పాల్గొన్నారు) ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయింది. దీంతో ఇప్పుడు.. టీడీపీ మరోసారి సంస్థాగత ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది.
తమ ఓటు బ్యాంకు ఏమైందనే వాదన వస్తోంది. నిజానికి బీసీల ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు స్థిరంగా కనిపించడంలేదు. వైసీపీ వైపు మెజారిటీ వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. అదేసమయంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా టీడీపీకి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థాగత ఓటు బ్యాంకును మళ్లీ తమవైపు తిప్పుకొనేందుకు టీడీపీ నేతలు ఏం చేయాలనే విషయంపై దృష్టి పెట్టారు. మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారో చూడాలి.