Begin typing your search above and press return to search.

ఇలా ఎలా సాధ్యం.. సీఎం జ‌గ‌న్‌ పై ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   10 Dec 2021 1:38 PM GMT
ఇలా ఎలా సాధ్యం.. సీఎం జ‌గ‌న్‌ పై ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ‌
X
``ఇలా ఎలా ఉండ‌గ‌లుగుతున్నారు ?. నిజానికి ఇంకెవ‌రైనా అయి ఉంటే.. ఖ‌చ్చితంగా.. ఉరుకులు ప‌రుగులు పెట్టేవారు! కానీ, జ‌గ‌న్ సార్ ఏంటి.. ఇలా మౌనంగా ధైర్యంగా ఉంటున్నారు?``-ఇదీ.. ఏ ఇద్ద‌రు ఉద్యోగులు ఫోన్ చేసుకున్నా.. వినిపిస్తున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించ లేదు.

దీంతో వారంతా కూడా తీవ్ర‌ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పీఆర్సీతో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి.

జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యో గులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన కార్యాక్రమాల్లో పాల్గొంటు న్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు.

దీంతో గ‌త మూడు రోజులుగా.. రాష్ట్రంలో ఉద్యోగుల నిర‌స‌న‌లు.. ప్ర‌భుత్వంపై వారు చేస్తున్న కామెంట్లు.. మీడియాలో ప్ర‌ధాన వార్త‌లుగా వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. స‌ల‌హాదారులుకానీ.. ఎవ‌రూ కూడా పెద్ద‌గా బెంబేలు ప‌డిపోవ‌డం లేదు.

హుటాహుటిన‌.. కేబినెట్ స‌మావేశాలు పెట్టేయ‌డం.. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ పై చ‌ర్చించేయ‌డం వంటివి కూడా చేయ‌ లేదు. ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంది అన్న‌ట్టుగా వారు మౌనంగా ఉన్నారు.

మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అస‌లు.. ప‌ట్టించుకోన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో చాలా మంది సీఎం జ‌గ‌న్ వైఖ‌రిని చ‌ర్చించుకుంటున్నారు. ఇలా ఎలా ఉండ‌గ‌లుగుతున్నారంటూ.. వారిలో వారు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.. ఈ విష‌యం లో కొంద‌రు ఉద్యోగులు ఏం చెబుతున్నారంటే.. ``జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కుడు. ప్ర‌తి దానికీ ఆయ‌న భ‌య‌ ప‌డిపోయే త‌ర‌హా నాయ‌కుడు కాదు. ప్ర‌తి విష‌యాన్నీ లోతుగా ఆలోచిస్తారు.

న్యాయం చేయాల‌ని అనుకుంటున్న‌ప్పుడు.. భ‌యం ఎందుకు? అనే ఆలోచ‌న‌ లో ఉన్న‌ట్టుగా ఉన్నారు`` అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా చ‌ర్చ‌లు ఉద్యోగుల మ‌ధ్య జోరుగా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే.. ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా త‌మ‌కు జ‌గ‌న్‌ పై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.