Begin typing your search above and press return to search.
సంసారాన్ని నిలబెట్టిన దిశ యాప్
By: Tupaki Desk | 14 Feb 2020 12:14 PM GMTదిశ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ కారణంగా ఇప్పటికే పలువురు మహిళలు తమ సమస్యల నుంచి బయటపడుతున్నారు. ఇటీవల ఒక యువతి ప్రమాదంలో చిక్కుకోవటం.. దిశ యాప్ ద్వారా పోలీసుల్ని సంప్రదించిన వెంటనే.. నిమిషాల్లో స్పందించి.. కంప్లైంట్ చేసిన యువతిని రక్షించారు.
ఇలాంటివేళ.. తాజాగా దిశ యాప్ కారణంగా ఒక కాపురం నిలబడింది. కృష్ణా జిల్లాలోని అనిగండ్లపాడు గ్రామంలో ఒక గ్రామ మహిళా వాలంటీర్ రాత్రి 10.20 గంటలకు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు ఇచ్చారు. అంతే.. అంత రాత్రివేళలోనూ పది నిమిషాల వ్యవధిలో పోలీసులు ఆమె కంప్లైంట్ చేసిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది.
తమకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఆ వెంటనే.. వారిద్దరికి కౌన్సెలింగ్ షురూ చేశారు. నిజానికి భార్య తప్పు లేదని.. ఆమెకు లోకం తెలీదని.. ఆమె ప్రపంచమంతా భర్తే అయినప్పుడు.. కాస్త సర్దుకుపోవాలని చెప్పారు. భార్యభర్తలు అన్న తర్వాత మనస్పర్థలు మామూలేని.. వాటిని అధిగమించాలే కానీ గొడవపడకూడదని.. పెళ్లి వేళలో ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పారు.
భార్యను బాధ పెడితే ఎవరికి చెప్పుకుంటుందన్న ప్రశ్న భర్తకు వేసి.. ఆమెను ప్రేమగా చూసుకోవాలని చెప్పటంతో వాలంటీర్ భర్త ఓకే చెప్పారు. అదే సమయంలో.. భార్యకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యను చక్కగా చూసుకుంటానని భర్త మాట ఇవ్వటంతో వారి నుంచి హామీ తీసుకున్న పోలీసులు తిరుగుముఖం పట్టారు. ఇలా ఒక కాపురాన్ని దిశ యాప్ నిలబెట్టినట్లైంది.