Begin typing your search above and press return to search.

ఎవ్వరూ చేయని సాహసం చేసిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   13 Dec 2019 9:40 AM GMT
ఎవ్వరూ చేయని సాహసం చేసిన జగన్ సర్కార్
X
తెలంగాణ లో నలుగురు కామాంధుల చేతిలో బలైపోయిన ‘దిశ’ ఉదంతం దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీలోనూ సీఎం జగన్ ఈ విషయంపై స్పందించారు. నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించిన కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు.

అయితే జగన్ అంతటి తో ఆగి పోలేదు. ఆడవాళ్ల మాన ప్రాణాలకు ఏపీలో రక్షణ కల్పించే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. ఆ కోవలోనే తాజాగా ఏపీ అసెంబ్లీలో ‘దిశ బిల్లు -2019’ను రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. మహిళలకు రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టిందని ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసమే సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చాడని వెల్లడించారు. దిశ చట్టం తో ఏపీలో మహిళల పై దాడులు చేయాలంటే భయపడేలా చట్టం ఉందన్నారు.

అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత ఏపీలోని మహిళలందరికీ సీఎం జగన్ రక్ష అని ప్రశంసించారు. మహిళ పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*దిశ చట్టం-2019లోని ముఖ్యాంశాలు
+మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఉరిశిక్ష
+ ఆధారాలు ఉంటే 21 రోజుల్లోనే తీర్పునిచ్చి అమలు.. నాలుగు నెలల విచారణ సమయాన్ని 21రోజులకు తగ్గింపు
+పోక్సో చట్టం కనీస శిక్ష ఐదేళ్ల కు పెంపు
+ప్రతి జిల్లాకు మహిళలు, చిన్నారులపై నేరాలకు ప్రత్యేక కోర్టులు
+సోషల్ మీడియా లో మహిళలను కించపరిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు
+పిల్లలపై లైంగిక నేరాలకు 10-14 ఏళ్ల వరకూ శిక్ష..

- Dinakar