Begin typing your search above and press return to search.

దిశ కేసు: మైనర్లను చంపడం నేరమా?

By:  Tupaki Desk   |   11 Dec 2019 5:12 AM GMT
దిశ కేసు: మైనర్లను చంపడం నేరమా?
X
ఢిల్లీలో నిర్భయను దారుణంగా రేప్ చేసి ఆమె చావుకు కారణమైన నలుగురిలో ఒకరు మైనర్. వాడే దారుణంగా ప్రవర్తించాడని పోలీసులు తేల్చారు. కానీ మైనర్ కావడంతో కేవలం 3ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. వాడు విడుదలయ్యాక పునరావాసం కింద కుట్టుమిషన్ కూడా ఇవ్వడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. హంతకుడిని ఉరితీయలేని మన చట్టాలు దుర్లభం అంటూ నిర్భయ తల్లి వాపోయింది. మైనర్ అయినంత మాత్రాన అతడు చేసిన క్రూరత్వం తగ్గిపోతుందా? ఉరిశిక్ష రద్దు అవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

ఇప్పుడు దిశ హంతకుల్లో మరణించిన ముగ్గురు నిందితులు మైనర్లు అని తేలింది. వీరు ఎన్ కౌంటర్ లో మరణించకుంటే కేవలం 3 ఏళ్ల జైలుశిక్షతో తప్పించుకునేవారు. అదే జరిగితే దిశ బాధితులకు తీరని అన్యాయం జరిగి ఉండేది. మన చట్టాలు, న్యాయాల వల్ల బాలనేరస్థులకు దక్కిన వరమిది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే పోలీసుల ఎన్ కౌంటర్ లో దిశ హంతకులు మరణించడంతో వీరికి శిక్ష పడిపోయింది.

ఇప్పుడు మైనర్లు అని వారి తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మైనర్లను చంపడం ఘోరం, నేరం అని అంతా అంటున్నారు.

కానీ పోలీసులకు ఉన్న వెసులుబాటు ఏంటంటే క్రైంలో ఎదురుతిరిగినా.. దాడి చేసినా.. కాల్పులు జరిపినా ఆత్మరక్షణార్థం ఎన్ కౌంటర్ చేసే రైట్ వారికుంటుంది. అప్పుడు మైనరా? మేజరా అన్న సంగతి పరిగణలోకి తీసుకోరు. అందుకే ఇప్పుడు మైనర్లను చంపేశామన్న వాదన జాతీయ మానవ హక్కుల సంఘంలోనూ, కోర్టుల్లోనూ నిలబడదన్న వాదన వినిపిస్తోంది.