Begin typing your search above and press return to search.

‘దిశ’ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు ఎవరు? వారి ప్రస్తుత హోదాలేంటి?

By:  Tupaki Desk   |   21 May 2022 11:30 AM GMT
‘దిశ’ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు ఎవరు? వారి ప్రస్తుత హోదాలేంటి?
X
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపిన ‘దిశ’ హత్యాచార ఉదంతం.. అనంతరం నిందితులైన నలుగురు పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో మరణించటం తెలిసిందే. దిశ హత్యాచార ఉదంతం చోటు చేసుకున్న వేళలో పెల్లుబుకిన ఆగ్రహావేశాలు ఒక ఎత్తు అయితే.. రోజుల వ్యవధిలోనే నిందితులు ఎన్ కౌంటర్ కావటంపై పండుగ వాతావరణం చోటు చేసుకోవటం తెలిసిందే.

నిజానికి దిశ నిందితుల ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న వేళ.. పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తటమే కాదు.. రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ ఎన్ కౌంటర్ మానవ హక్కుల్ని పూర్తిగా కాలరాయటమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి.

మానవ హక్కుల కార్యకర్తల మాటలకు ప్రజల్లో స్పందన పెద్దగా లేదన్న వాదన వినిపించేది. ఇదిలా ఉంటే.. ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హక్కుల కార్యకర్తలు చేసిన ఫిర్యాదులతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయటం.. దానికి సంబంధించిన రిపోర్టు తాజాగా సుప్రీంకోర్టుకు ముందుకు రావటం తెలిసిందే.

ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని.. ఇందులో పాల్గొన్న అధికారులపై హత్యా నేరం సెక్షన్లతో కేసు నమోదు చేయాలని పేర్కొనటం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులు ఎవరు? వారి హోదాలేమిటి? ప్రస్తుతం వారు ఎక్కడ పని చేస్తున్నారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తే.. దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది పోలీసు అధికారులు వారి ప్రస్తుత హోదాల్ని చూస్తే..

పోలీసు అధికారి పేరు వారి ప్రస్తుత హోదా

వి. సురేందర్ డీఎస్పీ, సీఐడీ

కె. నర్సింహారెడ్డి ఇన్ స్పెక్టర్, బాచుపల్లి

షేక్ లాల్ మదార్ ఇన్ స్పెక్టర్, సైబరాబాద్

కొచ్చెర్ల రవి ఎస్ఐ, ఎస్ వోటీ

కె. వెంకటేశ్వర్లు ఎస్ఐ, కొత్తూరు

మహ్మద్ సిరాజుద్దీన్ హెడ్ కానిస్టేబుల్, ఎస్ వోటీ

ఎస్. అరవింద్ గౌడ్ హెడ్ కానిస్టేబుల్

డి. జానకీ రాం హెడ్ కానిస్టేబుల్

ఆర్. బాలు రాథోడ్ కానిస్టేబుల్

డి. శ్రీకాంత్ కానిస్టేబుల్