Begin typing your search above and press return to search.
50శాతం కుళ్లిన దిశ నిందితుల మృతదేహాలు
By: Tupaki Desk | 21 Dec 2019 7:39 AM GMTదిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50శాతం కుళ్లిపోయాయని వారి బాడీలు భద్రపరిచిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ శనివారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు డిసెంబర్ 6న పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ బూటకమని కొన్ని సంఘాలు హైకోర్టు, సుప్రీం కోర్టుకెక్కాయి. మానవ హక్కుల సంఘాలు విచారణ జరిపాయి. దీంతో వీరి మృతదేహాలకు అంత్యక్రియలు జరుపకుండా ఆసత్రి ఫీజర్లలో భద్రపరిచారు.
తాజాగా హైకోర్టులో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై విచారణ జరిగింది. ఈ విచారణకు హాజరైన గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ శ్రావణ్ హైకోర్టుకు షాకింగ్ విషయం తెలియజేశారు. నలుగురు నిందితుల మృతదేహాలను 2 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్ లో ఉంచామని.. కానీ అవి ఇప్పుడు 50శాతం కుళ్లిపోయాయని తెలిపారు. మరో 10 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని ఆయన వివరించారు.
దీనిపై హైకోర్టు దేశంలోని ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందా అని డాక్టర్ శ్రవన్ ను ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానం ఇచ్చారు.
దీంతో వీలైనంత తొందరగా మృతదేహాల నుంచి ఆధారాలు సేకరించాలని ఇప్పటికే మృతదేహాలు 50శాతం కుళ్లిపోయిన నేపథ్యంలో విచారణ తొందరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.