Begin typing your search above and press return to search.

త‌లోర‌కం.. మాట‌.. ఏ `దిశ‌`గా విచార‌ణ‌?!

By:  Tupaki Desk   |   30 Oct 2021 12:30 AM GMT
త‌లోర‌కం.. మాట‌.. ఏ `దిశ‌`గా విచార‌ణ‌?!
X
వారంతా.. రాజ్యాంపై ప్ర‌మాణం చేసిన వారే.. రాజ్యాంగానికి క‌ట్టుబ‌డి.. ప్ర‌జ‌ల మాన ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని.. త‌మ‌ను ఆశ్ర‌యించిన బాధితుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని.. ప్ర‌మాణం చేసిన‌వారే. కానీ, నేడు.. మాట తిప్పేస్తున్నారా? త‌ల‌కోర‌కంగా.. మాట మార్చేస్తున్నారా? ఇదే.. ఇప్పుడు తెలంగాణలోనేకాదు.. ఏకంగా.. దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్న సందేహం. మ‌రీ ముఖ్యంగా ఐపీఎస్‌లు.. కూడా ఈ కేసులో నిజాలు చెప్ప‌డం లేదనే వాద‌న వినిపిస్తోంది. 2019లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న దేశవ్యాప్తంగా.. సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో బాధ్యులుగా గుర్తిస్తూ.. న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. సీన్ రీక్రియేష‌న్ అంటూ.. వారిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం.. ఈ క్ర‌మంలో నిందితులు త‌మ‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో కాల్పుల‌కు దిగ‌డంతో న‌లుగురు హ‌తుల‌య్యార‌ని.. పోలీసుల వాద‌న‌. కానీ, దీనిపై ప్ర‌జాసంఘాలు అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. జాతీయ మానవ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మ‌రికొంద‌రు సుప్రీంకోర్టు త‌లుపుత‌ట్టారు. జీవించే హ‌క్కును ఎలా అణిచేస్తారంటూ.. అప్ప‌ట్లో ఫైరైన సుప్రీం కోర్టు.. దీనిపై విచార‌ణ‌కు మాజీ జ‌స్టిస్‌.. సిరిపుర్క‌ర్ నేతృత్వంలో క‌మిష‌న్ ఏర్పాటు చేసింది.

ఆరు మాసాల్లోనే దీనిని విచారించాల‌ని.. కోర్టుఈ క‌మిష‌న్‌ను ఆదేశించింది. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో విచార‌ణ ఆల‌స్య‌మైంది. ఇక‌, విచార‌ణ ప్రారంభించాక‌.. ఈ కేసులో సాక్ష‌లుగా ఉన్న పోలీసులు.. ఇస్తున్న వివ‌ర‌ణ‌.. ప్ర‌జాస్వామ్య వాదుల మైండ్‌ను బ్లాంక్ చేస్తోంద‌ని .. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీనికితోడు క‌మిష‌న్ కూడా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతోంది. కొన్ని రోజుల కింద‌ట విచారించిన‌.. ప్ర‌స్తుత ఆర్టీసీ ఎండీ.. అప్ప‌టి క‌మిష‌న‌ర్‌.. స‌జ్జ‌నార్‌పైనా క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ అంటే.. ఏంటి..? అన్న క‌మిష‌న్ ప్ర‌శ్న‌కు ఆయ‌న త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డంపై నెటిజ‌న్లు.. కూడా నివ్వెర పోయారు.

మీడియా ఆయ‌న‌ను మోసినంత కాలం.. ఆయ‌న‌ను ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా పేర్కొంటూ.. పుంఖాను పుంఖాలుగా వార్త‌లు రాసినంత కాలం.. మౌనంగా ఉన్న ఆయ‌న ఎంజాయ్ చేసిన ఆయ‌న‌.. అస‌లు త‌న‌కు ఈ ప‌ద‌మే తెలియ‌ద‌ని చెప్ప‌డంపై.. పోరుగు రాష్ట్రాల పోలీసులు కూడా నివ్వెర పోయారు. ఇక‌, క‌మిష‌న్ తీవ్ర‌స్థాయిలో సీరియ‌స్ అయింది. తాజాగా జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో భాగంగా... నాటి ఎన్కౌంటర్లో పాల్గొన్న సైబరాబాద్‌ సీఐ లాల్మదార్, కానిస్టేబుల్ సిరాజుద్దీన్లను ప్రశ్నించింది. ఎన్కౌంటర్ తర్వాత మృతదేహాలపై గాయాలను పరిశీలించారా? అని కమిషన్ ప్రశ్నించగా... లేదని లాల్మదార్ సమాధానమిచ్చారు.

దీంతో తీవ్ర‌స్థాయిలో ఫైరైన క‌మిష‌న్ .. 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను(శ‌వాల‌ను) పలకరించేందుకు వెళ్లారా?' అని అసహనం వ్యక్తం చేసింది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎంత సమయం అక్కడ ఉన్నారని సిర్పూర్కర్ కమిషన్ అడిగిన ప్రశ్నకు... రాత్రి 8.30 గంటల వరకు ఉన్నామని లాల్మదార్ సమాధానమిచ్చారు. సెల్ఫోన్ల లొకేషన్‌ నార్సింగి, గ్రేహౌండ్స్‌ యూనిట్‌, శంషాబాద్‌ ప్రాంతంలో ఉన్నట్లు చూపించింది కదా అని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్ ప్రశ్నించగా... ఎన్కౌంటర్ అనంతరం ఉన్నతాధికారులు తమ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ఘటనాస్థలానికి దూరంగా ఉంచారని సీఐ బదులిచ్చారు. ఇలా.. కూడా జ‌రుగుతుందా? అని క‌మిష‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌జాస్వామ్య వాదులు.. అస‌లు ఈ దిశ కేసు.. ఏదిశ‌గా సాగుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.