Begin typing your search above and press return to search.

ఎలెన్ మస్క్ ను విమర్శించిన ఉద్యోగుల తొలగింపు

By:  Tupaki Desk   |   18 Jun 2022 1:30 PM GMT
ఎలెన్ మస్క్ ను విమర్శించిన ఉద్యోగుల తొలగింపు
X
ప్రపంచ కుభేరుడు ఎలెన్ మస్క్ ఈమధ్య వార్తల్లో తెగ నానుతున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఆయన తన సంస్థ ఉద్యోగలు పట్ల చాలా కఠినంగా ఉంటారు. అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయాలని.. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాడని రకరకాల వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంలో ముందుగా ఆ సంస్థ ఉద్యోగులే ఆందోళన చెందారు.

ట్విట్టర్ ఎలెన్ మస్క్ చేతికి వెళితే ఇక తమకు భవిష్యత్తు ఉండదని బహిరంగంగానే ప్రకటించారు. అలాంటి కార్ల కంపెనీ అధినేతను విమర్శిస్తే ఎలా ఉంటుంది..? తనకు నచ్చని పనిని చేస్తే ఏం చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయనపై వచ్చిన రూమర్స్ విషయంలో ఎలెన్ మస్క్ సీరియస్ అయ్యాడు. తన సంస్థ ఉద్యోగులైనా సరే.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నట్లు ప్రవర్తించాడు. ఇంతకీ ఎలెన్ మస్క్ ఏం చేశాడంటే..

స్పేస్ ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ పై ఇటీవల ఓ లేఖ బాగా వైరల్ ఉంది. ఈ లేఖను ఆ సంస్థ ఉద్యోగులే షేర్ చేశారు. ఇందులో ఎలెన్ మస్క్ ప్రవర్తనపై ఓ స్టోరీ రాశారు. స్పేస్ ఎక్స్ అధ్యక్షుడు ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని అందులో ఉంది. అంతేకాకుండా ఓ ఫైలెట్ తో అసభ్యంగా ప్రవర్తించారని కూడా రాశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, ఆయన ప్రవర్తన వల్ల మానసికంగా కుంగిపోతున్నామని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక ఇందులో స్పేస్ ఎక్స్ నో యాసోల్ విధానం గురించి కూడా ప్రస్తావించారు. ఎలోన్ ట్విట్టర్ ప్రవర్తనను కూడా ఖండించారు.

ఈ లేఖను సోషల్ మీడియాలో అంతర్గతంగా చాట్ చేసిన సందర్భాల్లో షేర్ చేశారు. ఈ విషయం ఎలెన్ మస్క్ దృష్టికి వెళ్లింది. దీంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎలెన్ మస్క్ ఊగిపోయాడు.

ఏమాత్రం ఆలోచించకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించాడు. దీంతో స్పేస్ ఎక్స్ అధ్యక్షుడు గ్విన్ షార్ట్ వెల్ అనేకమంది ఉద్యోగులను తొలగించాడు. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించింది మాత్రం బయటకు చెప్పలేదు. కానీ ఈ లేఖ ప్రమేయం ఉన్న వారందరిపై వేటు పడినట్లు సమాచారం.

ఎలెన్ మస్క్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ విమానంలో ప్రయాణిస్తూ ఫ్లైట్ అటెండెంట్ ను లైంగికంగా వేధించాడనే వార్తలు వచ్చాయి. అయితే తనపై రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని ఎలెన్ మస్క్ ఖండిచారు. తన 44 బిలియన్ డాలర్ల బిడ్ కు అంతరాయం కలిగించడానికి ఈ ఆరోపణలు అని పేర్కొన్నాడు. అయితే డాగ్ కాయిన్ పిరమిడ్ స్కీమ్ లో భాగంగా పెట్టుబడిదారులను మోసగించినందుకు మస్క్ తో పాటు ఆయన కంపెనీలపై సివిల్ దావా వేశారు. పెట్టుబడి దారులను ఆకర్షించడానికి డాగ్ కాయిన్ ను హైపింగ్ చేసే ‘పంప్ అండ్ డంప్’ అనే రాకెట్ లో ఎలెన్ మస్క్ భాగస్వామి అని ఆరోపించింది.