Begin typing your search above and press return to search.
వేలంలో పోటీ పడి ఓడిన సంస్థతో డిస్నీ స్టార్ సర్ ప్రైజ్ డీల్
By: Tupaki Desk | 31 Aug 2022 5:13 AM GMTక్రీడలు ఎన్ని ఉన్నా.. క్రికెట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను చూసేందుకు గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో.. పనులెన్ని ఉన్నా క్రికెట్ మీద ఒక కన్నేసి మరీ ఉంచటం చూస్తే.. ఈ ఆట మీద దేశ ప్రజలకున్న అభిమానం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది. క్రికెట్ అంటే ఒక్క ఆట మాత్రమే కాదు. అంతకు మించి కూడా. మైదానంలో జరిగే ఈ ఆటకు సంబంధించి మైదానం బయట వేలాది కోట్ల రూపాయిల మార్కెట్ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న వేల కోట్ల మార్కెట్ కు సంబంధించిన ఒక పరిణామం ఇటీవల చోటు చేసుకుంది. ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) నిర్వహించే టోర్నీలకు సంబంధించి భారతదేశంలో టీవీ.. డిజిటల్ ప్రసార హక్కుల వేలాన్ని నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో సుమారు రూ.24వేల కోట్లకు డిస్నీ స్టార్ సొంతం చేసుకుంది. ఇదే వేలంలో పాల్గొన్న జీ ఎంటర్ టైన్ మెంట్ మాత్రం వెనుకపడింది.
ఇదిలా ఉంటే.. హక్కుల్ని సొంతం చేసుకున్న డిస్నీ స్టార్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ ప్రసారాల విషయంలో ఇంతకు ముందెప్పుడూ లేని రీతిలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. తాము గెలుచుకున్న హక్కుల నుంచి టీవీ హక్కులు జీ సంస్థకు సబ్ లీజ్ కు ఇస్తున్నట్లుగా పేర్కొంటూ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ సబ్ లీజ్ ప్రకారం 2024-27 మధ్యన ఐసీసీ పురుషుల క్రికెట్ టోర్నీలు.. అండర్ 19 టోర్నీలు జీ చానల్స్ ప్రసారం కానున్నాయి. అదే సమయంలో డిజిటల్ హక్కుల్ని మాత్రం డిస్నీ తన వద్దే ఉంచుకుంది. నిజానికి డిస్నీ స్టార్ తో పోలిస్తే.. జీకి బలం లేదు. తాజా సబ్ లీజ్ ను చూస్తే..
2024-27 మధ్యలో ఐసీసీ క్రికెట్ టోర్నీలు.. అండరర్ 19 టోర్నీలు సోనీతో పాటు.. జీ చానల్స్ లోనూ ప్రసారం కానున్నాయి. దీంతో.. భారీగా ప్రకటన సొమ్మును ఆర్జించే వీలు కలుగుతోంది. అయితే డిస్నీ స్టార్ తో చేసుకున్న ఒప్పందంలో జీ ఎంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్న అంశం మాత్రం బయటకు రాలేదు. పురుషుల టోర్నీలను జీతో పంచుకున్న డిస్నీ..
అందుకు భిన్నంగా మహిళల వరల్డ్ కప్ హక్కుల్ని మాత్రం పూర్తిగా తన వద్దనే ఉంచుకుంది. ఇప్పటివరకు లేని విధంగా ఒకే మార్కెట్ ను ఇద్దరు పోటీ దారులు పంచుకోవటం తొలిసారి కావటం గమనార్హం. మరి.. ఈ ప్రయోగం ఎవరికి లాభం చేకూరేలా చేస్తుంది? ఎవరికి నష్టం వాటిల్లుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.