Begin typing your search above and press return to search.

బాబైనా మారాలి.. వారినైనా మార్చాలి

By:  Tupaki Desk   |   11 Dec 2022 3:30 PM GMT
బాబైనా మారాలి.. వారినైనా మార్చాలి
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం చేస్తున్నా పార్టీ కోసం.. రాష్ట్రం కోస‌మేఅనే విష‌యాన్ని త‌మ్ముళ్లు గ్ర‌హించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ప‌లు జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ త‌మ్ముళ్లు మాత్రం ఒక‌రిలో ఒక‌రు వివాదాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇలాంటి ఎప్పుడు తెర‌మీదికి వ‌చ్చినా చంద్ర‌బాబు స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాని, కొన్ని కొన్నింటిని మాత్రం ఆయ‌న కూడా స‌రిదిద్ద‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాకినాడ టీడీపీకి చాలా స్పెష‌ల్‌. ఇక్క‌డి నాయ‌కులుపార్టీకి ఎంతో ముఖ్యం. అయితే, ఇది గ‌తం మాట ఇప్పుడు మాత్రం.. పార్టీ బాధ్యులే అధిష్టానంపై అసంతృప్తితో ర‌గులుతున్నార‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం ఇన్‌చార్జిల మార్పే అని స‌మాచారం.

వాస్త‌వానికి గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి మెరుగుప‌డాల‌ని.. ప‌డుతోంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కానీ జిల్లాల్లో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే బాగా లేద‌ని పార్టీ నేత‌లే కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కీల‌క‌మైన‌ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌లో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ గెలుపు అత్యంత అవ‌స‌రం.

అయితే, ఇప్పుడు పార్టీ వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌ వనమాడి కొండబాబుకు మాజీ మేయ‌ర్‌ సుంకర పావ‌నికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. కొండబాబును పార్టీ ఉంచి బ‌య‌ట‌కు పంపించేసి ఇన్‌చార్జిగా పావనిని నియమించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. దీనినే సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది మ‌చ్చుకు మాత్ర‌మే తూర్పుగోదావ‌రిని తీసుకుంటే.. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.