Begin typing your search above and press return to search.
తెలుగురాష్ట్రాల్లో జోరుగా వ్యాక్సినేషన్
By: Tupaki Desk | 13 May 2021 1:30 AM GMTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేసేది వ్యాక్సిన్ మాత్రమేనని అందరూ నమ్ముతున్నారు. ప్రపంచదేశాలు ఇప్పుడు తమ ప్రజలకు వ్యాక్సిన్లను వేస్తున్నాయి. భారత్ లోనూ ఈ ప్రక్రియ మొదలైంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, పంపిణీని వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రాలు ఉన్నాయి.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కోటి సంఖ్యను దాటడం విశేషం. ఏప్రిల్ నెలలో ఇదే సమయంతో పోలిస్తే దాదాపు పదిరెట్లు వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.
మే 12 ఉదయం వరకు తెలుగు రాష్ట్రాలలో కోటి 29 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ చేరింది. మే 12వ తేదీనాటికి తెలంగాణ వ్యాప్తంగా 54 లక్షల 7 వేల 549 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇందులో 44 వేల 22 వేల 864 మంది వ్యాక్సిన్ తొలి డోసు వేసుకోగా.. 9 లక్షల 84 వేల 685 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతో పంపిణీ నత్తనడకన సాగింది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను రాష్ట్రాలు తొలి రోజుల్లో పెద్ద సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా వ్యాక్సిన్ పంపిణీ స్లోగా జరగడానికి కారణమైంది.
ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 66వేల 373 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో తొలి డోసువేసుకున్న వారి సంఖ్య 54 లక్షల 51వేలమంది. 20 లక్షల మంది రెండో డోసు వేసుకున్నారు.