Begin typing your search above and press return to search.
వైఎస్సార్ జయంతి నాడు ఇళ్ల పట్టాల పంపిణీ
By: Tupaki Desk | 24 April 2020 4:30 PM GMTకరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల భారత్ లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. లాక్ డౌన్ వల్ల దాదాపుగా అన్ని రంగాలు మూతబడడంతో పన్నులు లేక రాష్ట్రాల ఖజానాలు నిండుకున్నాయి. ఈ సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు వైద్యం, అత్యవసర సేవలపై, కరోనా కట్టడిపై మాత్రమే ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ లోటు బడ్జెట్ - అప్పుల్లో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా ఉంటానని, తాను ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తానని సీఎం జగన్ నిరూపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ సీఎం జగన్ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. 'వైఎస్సార్ సున్నా వడ్డీ ' పథకాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా బటన్ నొక్కి పొదుపు సంఘాల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. ఏపీలోని 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ ఎంఎస్ ద్వారా ఒకే విడతలో రూ.1400 కోట్లు జమ అయ్యాయి. అంతే కాదు, ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని జులై 8న చేపట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్ తెలిపారు.
నవరత్నాలలో భాగంగా రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 25న ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని జగన్ అనుకున్నారు. అయితే, ఎన్నికల నియమావళిని చూపించిన మాజీ ఎస్ ఈసీ రమేష్ కుమార్ ...ఆ కార్యక్రమం వాయిదా వేయించారు. ఆ తర్వాత కోర్టు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కరోనా విపత్తు వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల ఆ కార్యక్రమం ఏప్రిల్ 14కు వాయిదాపడింది. అంబేడ్కర్ జయంతినాడు ఆ కార్యక్రమం చేపట్టాలని జగన్ అనుకున్నారు. అయితే, లాక్ డౌన్ పొడిగించడంతో రెండోసారి ఆ కార్యక్రమం వాయిదాపడింది. దీంతో, తాజాగా వైఎస్ జయంతి సందర్భంగా జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని జగన్ నిర్ణయించారు. 27లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామని జగన్ అన్నారు. కరోనా విపత్తు రాకుంటే ఈ పాటికి పంపిణీ పూర్తయ్యేదని జగన్ అన్నారు. నామినేటెడ్ పనులు - పదవుల్లో 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని జగన్ చెప్పారు. మహిళలపై అత్యాచారం చేసినవారికి కఠినంగా శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, 13 దిశ పోలీస్ స్టేషన్లు - జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చామని జగన్ అన్నారు. 11వేలకు పైగా మహిళా పోలీసులను నియమించి, గ్రామ సచివాలయాల్లో 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. మహిళలందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.