Begin typing your search above and press return to search.

ఏపీలో జిల్లాల వివాదం సుప్రీం కోర్టుకెళ్లిందా?

By:  Tupaki Desk   |   29 March 2022 4:30 PM GMT
ఏపీలో జిల్లాల వివాదం సుప్రీం కోర్టుకెళ్లిందా?
X
ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌నంగా భావిస్తున్న‌.. రాజ‌కీయంగా మార్పుల‌కు, త‌మ పార్టికీ ప్ల‌స్ అవు తుంద‌ని.. అనుకుంటున్న జిల్లాల ఏర్పాటు ప్రక్రియ‌.. వివాదానికి దారితీసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా .. నాలుగు జిల్లాల్లో వివాదం జ‌రుగుతోంది. చిత్తూరు, క‌డ‌ప‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో అక్క‌డ కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న జిల్లాల విష‌యంలో ప్ర‌జ‌లు విభేదిస్తున్నారు. జిల్లా కేంద్రాల ఏర్పాటును మార్చాల‌ని.. త‌మ‌కు క‌డుదూరం అవుతుంద‌ని.. ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన‌.. ప్ర‌జ‌లు.. ఇక‌, ప్ర‌భుత్వ తీరుపై న్యాయ‌పోరాటాల‌కు దిగుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాను విభ‌జిస్తూ.. ఏర్పాటు చేయ‌నున్న బాలాజీ జిల్లా వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై కొన్నాళ్లుగా ఆందోళ‌న చేస్తున్న బీజేపీ నాయ‌కుడు.. భానుప్ర‌కాశ్ రెడ్డి.. ఇప్పుడు.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. సీఎంజ‌గ‌న్‌.. త‌న వైఖ‌రిలోనూ.. జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌జ‌ల అభిష్టాల‌కు సంబంధించి 9 వేల అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.

అయినా.. జ‌గ‌న్ ఎక్క‌డా వాటిని ప‌ట్టించుకుంటున్న దాఖ‌లా లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యం లో బాలాజీ జిల్లా కలెక్టరేట్ భవనం వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. తిరుపతి పద్మావతి నిలయాన్ని కొత్త కలెక్టరేట్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటంపై బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు వద్దని హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చింది. సింగిల్‌ జడ్జి స్టేపై ప్రభుత్వం ధర్మాసనంలో అప్పీల్‌కు వెళ్లింది.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసన కొట్టివేసింది. దీంతో హైకోర్టు బెంచ్‌ ఉత్తర్వులపై భాను ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల ఒకటికి వాయిదా వేసింది. నిజానికి దానికి మ‌రుస‌టి రోజు.. రాష్ట్ర ప్ర‌భుత్వం.. కొత్త జిల్లాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి ఆరోజు.. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.